నితిన్... రకుల్... బిజీ బిజీ
on Sep 5, 2019
పాతిక చిత్రాల మైలురాయి చేరుకున్న యువ హీరోల్లో నితిన్ ఒకడు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఏడాదికి ఒక్క చిత్రమైనా విడుదల చేయడం అతడి అలవాటు. ఈ ఏడాదీ క్రిస్మస్ కి 'భీష్మ' విడుదల చేస్తానని ప్రేక్షకులకు మాటిచ్చాడు. సరిగ్గా ప్లాన్ చేసుకుని ఉండి ఉంటే ఈ ఏడాది నితిన్ సినిమా ఈపాటికి విడుదల అయ్యేది. ఒక్కోసారి అన్నీ అనుకున్నట్టు జరగవు కదా! 'శ్రీనివాస కళ్యాణం' విడుదలై అప్పుడే ఏడాది అయింది. ఈసారి ఇంత గ్యాప్ రాకుండా ప్లాన్ చేశాడీ హీరో. 'భీష్మ'తో పాటు నెక్స్ట్ సినిమాను సెట్స్ మీదకు తీసుకొచ్చాడు. 'ఐతే', 'అనుకోకుండా ఒక రోజు', 'ఒక్కడున్నాడు', 'ప్రయాణం', 'సాహసం', 'మనమంతా' వంటి మంచి చిత్రాలను ప్రేక్షకులకు అందించిన చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతోంది. నితిన్, రకుల్ తదితరులపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రియా ప్రకాష్ వారియర్ మరో హీరోయిన్. ఈ హీరోయిన్లు ఇద్దరూ నితిన్ పక్కన నటించడం ఇదే తొలిసారి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
