ఏంటి ‘న్యూటన్’? ఏముంది ఇందులో?
on Sep 23, 2017
వెండితెర అద్భుతంగా తెరకెక్కి.. ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను మెప్పించిన ‘బాహుబలి’... ‘న్యూటన్’ ముందు మోకరిల్లాడు.
లక్ష్యాన్ని... తన ఆడబిడ్డల ద్వారా తీర్చుకునేందుకు ఓ సామాన్యుడు చేసిన ‘దంగల్’(యుద్ధం).. కూడా ...‘న్యూటన్’ ముందు తేలిపోయింది. చివరకు దేశం మీసం తిప్పిన అపజయమెరుగని పోరాట యోధుడు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కూడా న్యూటన్ చేతిలో ఓడిపోయాడు.
నిన్నగాక మొన్న విడుదలైన ‘న్యూటన్’... అప్పుడే ఆస్కార్ ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో నామినేట్ అయ్యింది. ఈ సినిమా ముందు పెద్ద పెద్ద సినిమాలన్నీ తలలు వంచేశాయ్. దేశం నుంచి ఈ పోటీలో 26 సినిమాలు నిలిచాయ్. అయితే... ప్రధానంగా జరిగిన యుద్ధం మాత్రం... బాహుబలి, దంగల్, గౌతమీపుత్ర శాతకర్ణి, న్యూటన్ సినిమాల మధ్యే. ఈ పోరాటంలో చివరకు ‘న్యూటన్’ విజయం సాధించింది. ఈ పోటీలో రెండు తెలుగు సినిమాలు ఉండటం... తెలుగువాళ్లందరూ గర్వంగా చెప్పుకోదగ్గ విషయం. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కమిటీకి హెడ్ గా వ్యవహరిస్తున్న తెలుగువాడు సీవీ రెడ్డి.. పోటీలో ఉన్న రెండు తెలుగు సినిమాలను పక్కకు నెట్టి.. ‘న్యూటన్’ని ఆస్కార్ బరిలో నిలపడం ఇక్కడ ఆసక్తికరమైన మరో విషయం.
ఏంటి ‘న్యూటన్’?.. ఏముందీ సినిమాలో..? జాతిని తట్టిలేపిన సినిమాలు సైతం.. ఆస్కార్ నామినీస్ రేస్ లో..‘న్యూటన్’ ముందు ఎందుకు నిలవలేకపోయాయ్? ఈ ప్రశ్నకు సమాధానం ఆ సినిమా చూసినవారికి మాత్రమే తెలుస్తుంది.
మావోయిస్ట్ ప్రేరేపిత ప్రాతమైన ఛత్తీస్ఘడ్ లో ఎన్నికల నిమిత్తం అక్కడకొచ్చిన ఓ ఎలక్షన్ ఆఫీసర్ కథ ఇది. మావోయిస్టులను ఎదిరించి మరీ.. అక్కడ ఎన్నికలు ఎలా నిర్వర్తించాడనేది ఈ కథలో ఆసక్తికరమైన అంశం. బాహుబలి, దంగల్, గౌతమీపుత్ర శాతకర్ణి.. సినిమాలను కూడా ఈ సినిమా వెనక్కునెట్టిందంటే.. మరి ఇందులో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది. చూడనివారుంటే వెంటనే చూసేయండి.