స్ఫైడర్ హిట్ అయితే.. పరిస్థితేంటి?
on Sep 23, 2017

‘జై లవకుశ’ పాజిటీవ్ టాక్ తెచ్చుకున్నా... తొలిరోజు వసూళ్ల పరంగా రికార్డులు క్రియేట్ చేయలేకపోయింది. ఫస్ట్ డే వసూళ్లలో మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’ 23 కోట్ల పైచిలుకు షేర్ రాబట్టి నంబర్ వన్ స్థానంలో నిలువగా.. ‘జై లవకుశ’ 21 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఓవర్సీస్ లోనూ ఇదే పంథాలో ‘జై లవకుశ’ వసూళ్లు సాగాయ్. ‘బాహుబలి’ సినిమాల వసూళ్లు అక్కడ ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటే.. నాన్ ‘బాహుబలి’ సినిమాల్లో ‘ఖైదీ నంబర్ 150’ నంబర్ వన్ గా నిలిచింది. రెండో స్థానంలో పవర్ స్టార్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఉండగా... ‘జై లవకుశ’ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. అంతే.. టోటల్ గా తొలిరోజు వసూళ్లలో ‘జై లవకుశ’ ఇక్కడ రెండో స్థానంలో ఉంటే... ఓవర్సీస్ లో 5వ స్థానంతో సరిపెట్టుకుందన్నమాట.
గురువారం విడుదలైన ‘జై లవకుశ’ తొలిరోజు రికార్డుల్ని బద్దలు చేయలేకపోయినా... వసూళ్ల సునామీనే క్రియేట్ చేసింది. మెగాస్టార్ ‘ఖైదీ నంబర్ 150’ తర్వాత స్థానాన్ని దక్కించుకుంది. ఇది సాధారణమైన విషయమేం కాదు. అయితే... అభిమానులు అంచనాలు మాత్రం తారుమారయ్యాయనే చెప్పాలి. ఇక రెండో రోజు వసూళ్లు గణనీయంగా తగ్గాయని టాక్. రెండు తెలుగు రాష్ట్రాల్లో 60 శాతం మాత్రమే థియేటర్లు నిండాయని తెలిసింది. ప్రస్తుతం నిర్మాతలు, బయ్యర్ల ఆశలన్నీ శని, ఆదివారాలపైనే. ఈ రెండ్రోజులు వసూళ్లు బావుంటే.. కొంతవరకూ బయటపడ్డట్టే. అయితే... ‘జై లవకుశ’కు జరిగిన మార్కెట్ వందకోట్ల పై చిలుకే అని టాక్. మరి ఆ స్థాయి వసూళ్లను ఈ సినిమా రాబట్టగలదా? అనేది కాలమే సమాధానం చెప్పాలి. పైగా 27న మహేశ్ ‘స్పైడర్’గా వస్తున్నాడు. ఆ సినిమా గనుక పెద్ద హిట్ అయితే.. ‘జై లవకుశ’ పరిస్థితి?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



