Home

»

Latest News

రజనీ కబాలీ రిలీజ్ డేట్ ఫిక్స్..!

Apr 21, 2016

భాషా లాంటి స్టిల్స్ తో, గ్యాంగ్ స్టర్ గా రజనీ రఫ్పాడించిన సినిమా కబాలీ. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న రజనీ అభిమానులకు గుడ్ న్యూస్. కబాలీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. జూన్ 3 న కబాలీని థియేటర్లలో దింపాలని నిర్మాత కలైపులి ఎస్ థాను నిర్ణయించుకున్నారట. ప్రస్తుతం రజనీ కబాలీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాయిన్ అయ్యారు. మే 1న కబాలీ టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ టీజర్ దాదాపు నిముషం డ్యూరేషన్ ఉంటుందని సమాచారం. రజనీకి మలేషియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ పైగా సినిమా సగం షూటింగ్ అక్కడే జరిగింది. ఆయన సినిమా రోబో సినిమా మలేషియాలో అద్భుతంగా ఆడింది. అందుకే కబాలీ ఆడియో ఫంక్షన్ ను మలేషియాలో జరిపేందుకు నిర్మాత ఆలోచిస్తున్నారట. ప్రస్తుతం రోబో 2 ను షూట్ లో పాల్గొంటూ బిజీగా ఉన్న రజనీ చెన్నైలో కబాలీకి డబ్బింగ్ చెబుతున్నారు. ఈ సినిమాతోనైనా తన వరస ఫ్లాపుల నుంచి రజనీ బయటపడతారని అభిమానులు ఆశిస్తున్నారు. వయసు ఐపోయిన డాన్ గా రజనీ కనిపిస్తుండగా, ఆయన సరసన రాధికా ఆప్టే నటిస్తోంది. పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com