ఓంపురి కాపాడకుంటే ఆ హీరో బతికే వాడు కాదట
on Jan 9, 2017
కొద్ది రోజుల క్రితం మరణించిన బాలీవుడ్ విలక్షణ నటుడు ఓంపురి గొప్పదనం గురించి రోజుకొక వార్త బయటకొస్తుంది..తాను ఇవాళ బతికున్నానంటే అందుకు కారణం ఓంపురినే అంటూ చెప్పుకొచ్చారు నట దిగ్గజం నసీరుద్దీన్ షా. వివరాల్లోకి వెళితే 1977లో భూమిక అనే సినిమా షూటింగ్ జరుగుతున్న రోజుల్లో తన స్నేహితుడైన ఓ వ్యక్తి కత్తితో తనపై దాడిచేస్తే అతడిని అడ్డుకోవడమే కాకుండా రక్తమోడుతున్న తనను ఆస్పత్రికి తీసుకెళ్లి తన ప్రాణాలు కాపాడాడని షా తన ఆత్మకథ "అండ్ దెన్ వన్ డే"లో పేర్కొన్నారు.
ఆ రోజు తన జీవితంలో మర్చిపోలేనని.. తాము డిన్నర్ కోసం ఓ హోటల్కి వెళ్లినప్పుడు తమ వెనకే జస్పాల్ అనే వ్యక్తి కూర్చున్నాడని..పురి తాను కబుర్లలో మునిగి ఉండగా జస్పాల్ ఒక్కసారిగా కత్తితో తనపై దాడి చేసి వీపులో పొడిచాడని తెలిపారు. తాను షాక్లో ఉండగానే ఓంపురి ఆలస్యం చేయకుండా జస్పాల్ని అడ్డుకుని..హోటల్ సిబ్బంది సాయంతో పట్టుకున్నాడని పేర్కొన్నారు. వెంటనే రక్తమోడుతున్న తనను ఓంపురి ఆస్పత్రికి తరలించి ప్రాణదానం చేశాడని..ఆ రోజు తనతో ఓంపురి లేకుంటే ఏమయ్యేదో తలచుకుంటేనే భయమేస్తోందని వివరించారు.