గ్యారేజ్ పేరిట మరో రికార్డు
on Jan 9, 2017
ఎన్టీఆర్, కొరటాల శివ కాంభినేషన్లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అంచనాలను మించిన కలెక్షన్స్‌తో పాత రికార్డులకి రిపేర్లు చేసి కొత్త రికార్డులని సృష్టించింది ఈ మూవీ. నాన్-బాహుబలి రికార్డులని, కొన్ని చోట్ల బాహుబలి రికార్డులని కూడా జనతా గ్యారేజ్ దాటేసింది, ఇప్పటికే అతి తక్కువ సమయంలో 50 కోట్లని వసూలు చేసిన తెలుగు సినిమాగా జనతా గ్యారేజ్ కొత్త రికార్డులని క్రియేట్ చేసింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ కెరిర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్లు వసూలు చేసిన మూవీగా నిలిచింది. తాజాగా గ్యారేజ్‌లో మరో రికార్డు వచ్చి చేరింది. 2016లో మోస్ట్ వాచ్డ్ తెలుగు మూవీగా ఘనతను దక్కించుకుంది. గతేడాది తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ పోటీ పడి మరీ ప్రసారం చేసిన సినిమాల్లో జనతా గ్యారేజ్ టాప్‌లో నిలిచింది. తెలుగులో ఎక్కువమంది టీవీలో చూసిన చిత్రంగా ఈ మూవీ నిలిచిందని టీవీ ఆడియన్స్ మానటరింగ్ ఏజెన్సీ బీఏఆర్సీ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది.