ENGLISH | TELUGU  

బాలయ్య-కృష్ణవంశీ మూవీలో రోమాన్స్‌కి నో ఛాన్స్..!

on Oct 31, 2016

కృష్ణవంశీ..క్రియేటివ్ కథలకు, పవర్‌ఫుల్ యాక్టింగ్‌కు ఈయన సినిమాలు కేరాఫ్. అదోక్కటే కాదు వెండితెరపై హీరోయిన్ల అందాలను అద్భుతంగా ఆవిష్కరించగల అతికొద్ది మంది దర్శకుల్లో కృష్ణవంశీ ఒకరు. ఆయన సినిమాల్లో హీరోయిన్లు కుందనపు బొమ్మల్లా ఉంటారు. అందాల అరబోతతో పాటు నటన ద్వారా ఈయన సినిమాల్లో నటించిన హీరోయిన్లు టాప్ ప్లేస్‌కి వెళ్లిపోతారు. ఈ విషయం ఎంతోమంది విషయంలో ప్రూవ్ అయ్యింది. అలా తన సినిమాల్లో మంచి కథతో పాటు రోమాన్స్‌కి ఇంపార్టెన్స్ ఇస్తాడు వంశీ. అయితే తాజాగా నందమూరి నటసింహం బాలకృష్ణతో కృష్ణవంశీ ఒక సినిమా చేయనున్నాడు.

ఇందులో బాలయ్య 70 ఏళ్ల వృద్ధుడిగా కనిపిస్తారట. ఆయన పాత్ర చాలా సీరియస్‌గా ఉండనుందట. అందువల్ల ఆ క్యారెక్టర్‌కి ఎలాంటి రొమాంటిక్ సీన్స్, సాంగ్స్‌ని పెట్టడం లేదట వంశీ. అయితే కథ, కథనాలు మాత్త్రం అదిరిపోతాయట. అందుకే రోమాన్స్‌ లేకపోయినా బాలయ్య సై అన్నాడట. ఇక ఈ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. బిగ్‌బీ ఏకంగా భారత రాష్ట్రపతిగా కనిపించబోతున్నారంటూ ఫిల్మ్‌నగర్‌లో ప్రచారం జరగుతోంది. ప్రస్తుతం గౌతమిపుత్ర శాతకర్ణి షూటింగ్‌లో బిజీగా ఉన్న బాలకృష్ణ..అనంతరం రైతును పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.