Home

»

Latest News

నితిన్ రెండు కోట్లు లాసయ్యాడా..?

Oct 31, 2016 4:01PM

రూమర్స్..సినిమాలు రెండూ అన్నదమ్ముల్లాంటివి. మిగతా ఏ రంగంలో ఉన్నవారిపైనైనా రూమర్స్ వస్తే అవి అంత బాగా పేలవు కాని సినీ రంగానికి చెందిన వారిపై రూమర్స్‌కి మాత్రం ఎక్కడా లేని గీరాకి. అందుకే మీడియా ఎప్పుడు స్టార్లను టార్గెట్ చేస్తూ ఉంటుంది. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో నితిన్‌ విషయంలో రూమర్స్ వచ్చాయి. "అ ఆ" తర్వాత ఏ కొత్త సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లలేదు నితిన్. ఆ మధ్య ఎం.వి.కె రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేశాడు. అదీ తన హోమ్ బ్యానర్‌లోనే. అయితే ఏమైందో గానీ ఈ సినిమా చర్చల దశలోనే ఆగిపోయింది. ఇప్పుడు ఈ సినిమా విషయంలోనే ఓ పెద్ద రూమర్ హల్‌చల్ చేస్తోంది.

ఈ మూవీ కోసం నితిన్ రెండు కోట్ల వరకు ఖర్చు పెట్టడాడని..ఆ కథ ఇప్పుడు అల్లు శిరీష్‌ హీరోగా తెరకెక్కనుందని. నితిన్ నష్టపోయిన ఆ రెండు కోట్ల ఖర్చును అల్లు అరవింద్ చెల్లించేందుకు డీల్ కుదిరిందని ఒక గాలివార్త ఫిలింనగర్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ రూమర్‌ని స్ప్రెడ్ చేసిన వారికి నిజంగా బుర్ర ఉందో లేదో తెలియడం లేదు. ఎందుకంటే అసలు ప్రీ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ కాని ఓ సినిమాకి రెండు కోట్లు ఎలా ఖర్చు అవుతుంది..? దాన్ని గీతా ఆర్ట్స్ ఎందుకు చెల్లిస్తుంది...? ఎక్కడైనా లాజిక్ ఉందా..? నితిన్ ఏమైనా నిన్న మొన్న నిర్మాత అయ్యాడా..? ఎలాంటి ప్లానింగ్ లేకుండా అంత సొమ్ము ఖర్చుపెట్టడానికి..?

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com