English | Telugu

'బ్రహ్మాస్త్ర'లో నాగార్జున క్యారెక్టర్ ఏంటంటే?

on Nov 21, 2019

ముంబైలో కొత్త ప్రేమజంట రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న సినిమా 'బ్రహ్మాస్త్ర'. ప్రముఖ హిందీ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రణబీర్ కపూర్ ఆప్తమిత్రుడు అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్, మన్మథుడు నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు. గత ఏడాది బల్గేరియాలో కొన్ని రోజులు షూటింగ్ చేశారు. తర్వాత ఇండియాలో వారణాసిలో కొన్ని రోజులు షూటింగ్ చేశారు. అమితాబ్ బచ్చన్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఫాంటసీ అంశాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల ఈ సినిమా కోసం షారుక్ ఖాన్ కూడా షూటింగ్ చేశారు. ఆయన అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఇంతకీ, ఈ సినిమాలో నాగార్జున క్యారెక్టర్ ఏంటో తెలుసా?

'బ్రహ్మాస్త్ర'లో నాగార్జున ఆర్కియాలజిస్ట్ (పురావస్తు శాస్త్రవేత్త)గా కనిపించనున్నారు. పురావస్తు విద్యార్థులతో కలిసి పవిత్ర గంగా నది ఒడ్డున ఉన్న దేవాలయాలను సందర్శించే యాత్ర చేపడతారట. ఓ సంఘటన హీరో హీరోయిన్లు ఇద్దరూ నాగార్జున దగ్గరకు వచ్చేలా చేస్తుందట. కథలో నాగార్జున పాత్ర కీలకమని తెలుస్తోంది. తెలుగు సినిమాల విషయానికి వస్తే... త్వరలో కొత్త దర్శకుడితో నాగార్జున సినిమా ప్రారంభం కానుంది. దర్శకుడు వంశీ పైడిపల్లి దగ్గర కొన్నాళ్లుగా పని చేస్తున్న అహిషోర్ సోలమన్ ను నాగార్జున దర్శకుడిగా పరిచయం చేయనున్నారు. డిసెంబర్ లో ఈ సినిమా మొదలు కానుంది.

 


Cinema GalleriesLatest News


Video-Gossips