ఫస్ట్ రజనీ... నెక్స్ట్ మహేష్... తర్వాత బన్నీ?
on Nov 21, 2019
సంక్రాంతి నిర్మాతలకు రిలీజ్ డేట్స్ టెన్షన్ ఓ కొలిక్కి వచ్చినట్టే. రజనీకాంత్ హీరోగా మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న 'దర్బార్', సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'సరిలేరు నీకెవ్వరు', మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ముచ్చటగా మూడోసారి స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న 'అల... వైకుంఠపురములో', నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్న 'ఎంత మంచివాడవురా' చిత్రాలు సంక్రాంతి బరిలో దిగుతున్నాయి.
ప్రస్తుతానికి 'సరిలేరు...', 'అల...' చిత్రాలు జనవరి 12న రావడానికి సిద్ధమయ్యాయి. ఈ మేరకు నిర్మాతల నుండి విడుదల తేదీ ప్రకటనలు కూడా వచ్చాయి. అయితే, రెండు పెద్ద సినిమాలు ఒకే రోజున వస్తే, రెండు సినిమాల ఓపెనింగ్స్ తగ్గుతాయి. అదే ఒకటి ముందు రోజు వస్తే సమస్య కొంచెం తగ్గుతుంది. 'సరిలేరు...' నిర్మాతలలో ఒకరైన 'దిల్' రాజు, 'అల... వైకుంఠపురములో' నైజాం థియేట్రికల్ రైట్స్ తీసుకున్నారు. సో... మహేష్ సినిమాను ఒక్క రోజు ముందుకు జరిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ గమనిస్తున్న రజనీకాంత్ 'దర్బార్' నిర్మాతలు, తమ సినిమాను మూడు రోజుల ముందుకు తీసుకువెళ్లారు.
రజనీకాంత్ 'దర్బార్' జనవరి 9న విడుదల చేస్తున్నట్టు లైకా ప్రొడక్షన్స్ సంస్థ తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఒకవేళ మహేష్, అల్లు అర్జున్ సినిమాలు జనవరి 10 11, 12... ఏ తేదీల్లో వచ్చినా సమస్య ఉండదని. నందమూరి కల్యాణ్ రామ్ అయితే తన సినిమాను జనవరి 15న విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు. సో... అతడికీ ప్రాబ్లమ్ లేదు. ఎటొచ్చి... మహేష్, బన్నీలో ఎవరు ముందు వస్తారనేది క్వశ్చన్. మ్యాగ్జిమమ్ మహేష్ బాబు సినిమా జనవరి 11న విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయట. దాంతో రిలీజ్ డేట్స్ టెన్షన్ ఓ కొలిక్కి వచ్చినట్టే. థియేటర్స్ అడ్జస్ట్‌మెంట్స్ ఉంటాయి. తర్వాత ఏ సినిమాకు హిట్ టాక్ వస్తే ఆ సినిమా ఎక్కువ రోజులు ఆడుతుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
