English | Telugu

'శివ 2' కి సై అంటున్న నాగ్...

on Oct 7, 2019


టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ శివ విడుదలై ముప్పై ఏళ్ళు. పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అక్టోబర్ ఐదున ఈ సినిమా విడుదలైంది. సైకిల్ చైన్ తో తెలుగు సినీ తెరపై అక్కినేని నట వారసుడు నాగార్జున సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. నాగార్జున సినీ జీవితంలో ఓ మైలురాయిగా నిలిచింది. ఇండస్ట్రీ లోకి అప్పుడే అడుగు పెట్టిన ఆర్జీవి తెలుగు సినీ పరిశ్రమకు కొత్తదనాన్ని పరిచయం చేశాడు. తొలి అవకాశంతోనే తనెంటో నిరూపించుకున్నాడు. శివ సినిమాకు ముప్పై ఏళ్లు పూర్తయిన సందర్భంగా దర్శకుడు ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నాడు. నాగార్జున ఇవాళ మన ప్రియమైన బిడ్డ ముప్పైయోవ పుట్టినరోజు అని ట్వీట్ చేశాడు. శివ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్ అంటూంటారు సినీ విమర్శకులు. ఇళయరాజా బాణీలు అందించిన ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్ డూపర్ హిట్. ముఖ్యంగా "బోటనీ పాటముంది మ్యాటనీ ఆట ఉంది"," సరసాలు చాలు శ్రీవారు" పాటలు ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినపడుతూనే ఉంటాయి.

తమిళ, హిందీల్లో విడుదల చేయగా అక్కడ సూపర్ హిట్టైంది. అప్పటికీ ఇప్పటికీ ఎంతో మంది కొత్త దర్శకులకు నటీనటులకు స్ఫూర్తిగా నిలుస్తూనే ఉంది. 'రామగోపాల్ వర్మ పెక్యులర్ పర్సన్, నాకు కథ చెప్పాలని వచ్చినప్పుడు ఓడ్కా తాగి వచ్చేవాడ'ని నాగార్జున గుర్తు చేసుకున్నారు. "అన్నింటికంటే నాకు రాము ఫ్రెండ్ గా బాగా ఇష్టం. నాకు కథ చెబుతానని వచ్చినప్పుడు వొడ్కా తాగి తరువాత కథ చెప్పేవాడు. 'అంతం' కథ చెప్పేటప్పుడు కత్తితో పొడిచే సీన్ యాక్ట్ చేసి మరీ చూపించాడు. ప్రతిదీ ఫీలై చెబుతాడు. వర్మకు 'శివ' సినిమాతో నేనేదో బ్రేకిచ్చాను అంటున్నారు కానీ, నేను అలా పిలవడం లేదు, ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నాం. కానీ రాము, నేను నక్షత్రాల గురించి, బ్రూస్లీ గురించి బాగా మాట్లాడుకునేవాళ్లం. దాంతో మా ఇద్దరికీ బాగా కనెక్ట్ అయ్యింది.

'శివ' సినిమా అనేది లైఫ్ ఛేంజింగ్ మూమెంట్ ఫర్ మీ. తెలుగు సినిమాని మార్చేసిన సినిమా. ఇండియాలో వంద బెస్ట్ మూవీస్ సెలెక్ట్ చేస్తే అందులో 'శివ' ఉంది. అలా జరగడం చాలా అరుదు. ఇప్పుడు రాజమౌళి 'బాహుబలి'తో సంచలనం సృష్టించాడు. నా లైఫ్ లో ఉన్నందుకు రామూకు థాంక్స్ చెబుతున్నాను. నాతో 'శివ 2' తీద్దామని చాలా మంది వచ్చారు. రాము తీస్తానంటే చెయ్యడానికి నేను రెడీ" అని ఆయన తన భావాన్ని కొంటెగా వెల్లడించారు.


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here