English | Telugu

'జెర్సీ' హీరోయిన్ తో చైతు రొమాన్స్!!

on Apr 22, 2019

 

`మ‌జిలీ` సినిమా ఇచ్చిన స‌క్సెస్ తో మాంచి జోష్ లో ఉన్నాడు నాగ చైత‌న్య‌.  ఈ ఉత్సాహంతో కొత్త ద‌ర్శ‌కులతో సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నాడు. ఇప్ప‌టికే `వెంకీతో క‌లిసి `వెంకీమామ‌` చిత్రంలో న‌టిస్తోన్న  చైతూ మ‌రోవైపు ఫాద‌ర్ నాగార్జున‌తో `సోగ్గాడే చిన్ని నాయ‌నా` చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతోన్న `బంగార్రాజు` చిత్రంలో న‌టించ‌డానికి రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉంటే మ‌రో నూత‌న ద‌ర్శ‌కుడు శశితో చేయ‌బోతున్న సినిమాలో ల‌వ‌ర్ బాయ్ గా డిఫ‌రెంట్ గెట‌ప్ లో క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.
 
ప్యూర్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాను హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మించ‌నున్నారు. అయితే ఈ సినిమాలో నాగ చైత‌న్య స‌ర‌స‌న `జెర్సీ` సినిమాతో మంచి మార్కులు కొట్టేసిన హీరోయిన్ శ్ర‌ద్ధా శ్రీనాథ్ న‌టించే అవ‌కాశాలున్నాయట‌. ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు శ‌శి ఆమెకు స్టోరీ కూడా నేరేట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. త్వ‌ర‌లో దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.


Cinema Galleries



Latest News


Video-Gossips