సల్లూ భాయ్ తో అలీ భాయ్!!
on Apr 22, 2019
బాల నటుడుగా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన అలీ స్టార్ కమెడియన్ గా టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసుకున్నాడు. హీరోగా కూడా పలు సినిమాల్లో నటించి అటు ప్రేక్షకులు, ఇటు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఎంతో మంది యంగ్ కమెడియన్స్ వస్తోన్న తనకు మాత్రం క్యారక్టర్స్ ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయి. అలాగే ప్రస్తుతం బుల్లి తెరపై పలు టీవీ షోస్ తో హల్ చల్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే అలీకి సంబంధించి న్యూస్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాకు అంకితమైన అలీకి తాజాగా ఒక బాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందట. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో నటించే అవకాశం వచ్చిందట.
ఒకసారి వివారల్లోకి వెళితే...ప్రజంట్ సల్మాన్ ఖాన్ `దబాంగ్ -3` సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక మంచి రోల్ చేస్తున్నాడట అలీ. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ లో పాల్గొంటున్న అలీ తన కుటుంబంతో కలిసి తీయించుకున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.