మొహంజదారో ఫస్ట్ లుక్..ఇరగదీసింది..!
on Jun 7, 2016
బాలీవుడ్ చరిత్రలోనే భారీ సినిమా తెరకెక్కుతున్న సినిమా మొహంజాదారో. హిందీ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, పూజా హెగ్డే జంటగా ఈ సినిమాను తెరకెక్కించాడు అశుతోష్ గోవారికర్. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఈ రోజు రిలీజ్ చేశారు. సినిమా క్యాస్టింగ్ కు సంబంధించిన ఎవరి ఫోటో లేకుండా జస్ట్ మూవీ టైటిల్ ఫస్ట్ లుక్ మాత్రమే రిలీజ్ చేసి ఆకట్టుకున్నాడు దర్శకుడు. వేల సంవత్సరాలు క్రితం విలసిల్లిన ఒక నాగరికతలో, ఒక జంట మధ్య జరిగిన ప్రేమకథే మోహంజదారో సినిమా కథ. సినిమా టైటిల్ డిజైన్ కూడా, అప్పటి లిపి తరహాలో డిజైన్ చేయడం విశేషం.
లగాన్, జోథా అక్బర్ లాంటి హిస్టారికల్ సినిమాల్ని తెరకెక్కించిన అశుతోష్, తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా తీస్తున్న సినిమా ఇది. హృతిక్ రోషన్ గత రెండేళ్లుగా మరే సినిమా ఒప్పకోకుండా ఈ సినిమాకోసం కష్టపడుతున్నాడు. పూజా హెగ్డే మొత్తం డేట్స్ అన్నింటినీ ఈ సినిమాకే కేటాయించేసింది. యుటీవీ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై సిద్దార్ధ్ రాయ్ కపూర్, అశుతోష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా ఉన్న అంచనాలను ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ మరింత పెంచుతుందనడంలో డౌట్ లేదు.