సింగపూర్ సైమాలో మెరవనున్న మెగాస్టార్..!
on Jun 7, 2016
.jpg)
సినిమాల్లోకి మళ్లీ ఎంట్రీ ఇస్తున్న మెగాస్టార్ చిరంజీవికి ఆ సందర్భాన్ని తోటి నటీనటుల మధ్య జరుపుకోవడానికి మంచి సందర్భం లభించింది. ఈ జూన్ 30, జూలై 1 న రెండు రోజుల పాటు సింగపూర్ లో జరిగే సైమా సౌత్ ఇండియన్ అవార్డ్స్ ఫంక్షన్ కు ఆయనకు ప్రత్యేక ఆహ్వానం లభించింది. దీనికి చిరు కూడా సై అన్నారట. సౌత్ ఇండియాలోని తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ సినీ పరిశ్రమలన్నీ సైమా అవార్డ్స్ కు హాజరవుతాయి. ఇన్నాళ్లూ పాలిటిక్స్ లో ఉంటూ, సినీ వాతావరణానికి, చిరుకు కాస్త ఎడబాటు వచ్చింది.
ఆయన సినిమాల్లోకి వస్తున్నారని కన్ఫామ్ అయిన తర్వాత హాజరవుతున్న తొలి గ్రాండ్ ఈవెంట్ ఇదే కావడం విశేషం. జూన్ 15 నుంచే కత్తిలాంటోడు షూటింగ్ మొదలవనుంది. అంటే షూటింగ్ స్టార్ట్ అయిన 15 రోజుల్లో గ్యాప్ ఇచ్చి మరీ, సింగపూర్ అటెండ్ అవుతున్నారు చిరు. దీని బట్టే ఆయన ఈ వేడుకకు ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. చిరుతో పాటు ఈ వేడుకకు అల్లు అర్జున్, అల్లు శిరీష్ లు కూడా హాజరవుతారని సమాచారం. మిగిలిన మెగా హీరోల్లో చరణ్ ' ధృవ ' షూటింగ్ లో, వరుణ్ ' మిస్టర్ ' షూటింగ్ లో, సాయిథరమ్ తేజ ' తిక్క ' షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



