మోడీకి "టాయెలెట్" అంత బాగా నచ్చిందా..?
on Jun 14, 2017
.jpg)
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశాన్ని క్లీన్ అండ్ గ్రీన్‌గా మార్చేందుకు నడుం బిగించారు ప్రధాని నరేంద్రమోడీ..దీనిలో భాగంగా స్వచ్ఛ్ భారత్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఇక అప్పటి నుంచి దేశంలో శుభ్రతపై అవగాహన బాగా పెరిగింది. అమ్మాయిలు టాయెలెట్ ఉన్న ఇంటికే కోడలిగా వెళతామని పంతం పట్టటం, మంగళసూత్రాలు అమ్మేసి టాయ్‌లెట్లు నిర్మించుకోవడం లాంటి వార్తలను వింటూ వస్తున్నాం. సాధారణంగా ఏ అంశాన్ని వదిలిపెట్టని సినిమా వాళ్లు స్వచ్ఛ్ భారత్‌ని కూడా వదల్లేదు. తాజాగా ఈ అంశంతోనే అక్షయ్ కుమార్ ఒక సినిమా తీస్తున్నాడు. దాని పేరు టాయ్‌లెట్..ఏక్ ప్రేమ్ కథ. ఇందులో అక్షయ్‌కి జోడీగా భూమీ పడ్నేకర్ నటిస్తున్నారు. రీసెంట్‌గా రిలీజైన ఈ మూవీ ట్రైలర్ అన్ని వర్గాలను ఆకట్టుకుంది. దీనిని చూసిన ప్రధాని నరేంద్రమోడీ చిత్ర యూనిట్‌ను అభినందించారు. పరిశుభ్రతపై ప్రజలను చైతన్య పరచడంలో ఈ సినిమా మంచి ప్రయత్నమన్నారు. 125 కోట్ల మంది భారతీయులు స్వచ్ఛ్‌భారత్ కలను సాకారం చేయడానికి కలిసి పనిచేయాలన్నారు. నారాయణ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 11న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా రిలీజ్ చేయనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



