అమీర్ మూడో పెళ్లిపై సల్మాన్ అంత మాటన్నాడా..?
on Jun 14, 2017
.jpg)
సినిమాల పరంగా తమ మధ్య ఎన్ని ఉన్నా.. బాలీవుడ్ అగ్రనటులు సల్మాన్‌ఖాన్, అమీర్‌ఖాన్‌లు బయట స్నేహానికి ప్రాణమిస్తారు. ఒకరి మీద ఒకరు జోక్స్ వేసుకుంటూ సరదాగా గడుపుతుంటారు. అది స్టేజ్ మీదైనా సరే..వేరే ఎక్కడైనా సరే. తను నటించిన ట్యూబ్‌లైట్ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు సల్లూభాయ్..ఈ సందర్భంగా అమీర్ మీ కాళ్లు, చేతులు కట్టేసి పెళ్లి చేస్తారటగా అని యాంకర్ ప్రశ్నించింది. దానికి సమాధానంగా ఆయన నా కాళ్లు, చేతులు కట్టేసి పెళ్లి చేస్తే..నేనూ అమీర్ కాళ్లు, చేతులు కట్టేసి మూడో పెళ్లి చేసుకోకుండా చూస్తాను అన్నాడు. ఇప్పటికే బాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌గా ఉన్న సల్మాన్‌కు 50 ఏళ్లు నిండాయి. తరచూ ప్రేమలో పడటం..పెళ్లి పీటలదాకా వెళ్లడం మధ్యలో అది పెటాకులవ్వడం ఎప్పటి నుంచో జరుగుతూ వస్తుంది. కానీ సల్మాన్ పెళ్లి మాత్రం కావడం లేదని అభిమానులు బాధ పడుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



