మెగాస్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..!
on May 24, 2016
రెండేళ్లుగా చిరంజీవి సినిమా పట్టాలెక్కేదెప్పుడో అని ఎదురుచూస్తున్న మెగాభిమానులకు శుభవార్త. జూన్ 6 న సినిమా రెగులర్ షూటింగ్ మొదలవబోతోందనే వార్త ఫిలింనగర్లో వినిపిస్తోంది. సినిమా వర్గాలు అఫీషియల్ గా కన్ఫామ్ చేయనప్పటికీ, ఈ న్యూస్ పక్కా అని సమాచారం. ఇప్పటికే సినిమా షూటింగ్ ను ముహూర్తం చూసుకుని లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత నెల రోజుల గ్యాప్ ఇచ్చిన చిరు, ఇప్పుడు అన్నింటికీ రంగం సిద్ధం చేసుకుని రెడీ అవుతున్నారట. తమిళంలో సూపర్ హిట్ అయిన కత్తి సినిమాను రీమేక్ కాన్సెప్ట్ గా ఎంచుకుని ఈ సినిమా తీస్తున్నప్పటికీ, చిరు బాడీ లాంగ్వేజ్ కు ఇమేజ్ కు తగ్గట్టుగా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేశారు. లైకా ప్రొడక్షన్స్ తో రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనుష్కను హీరోయిన్ గా తీసుకుంటున్న ఈ సినిమా, వచ్చే ఏడాది సంక్రాంతికి లేదా, వేసవికి వచ్చే అవకాశాలున్నాయి.