వేసవి భారీ ఫ్లాపుల్లో కాజల్..!
on May 24, 2016

నిన్న మొన్నటి వరకూ హాట్ కేక్ లా ఉన్న కాజల్ కెరీర్ ఇప్పుడు ప్రమాదంలో పడింది. యాక్ట్ చేసిన రెండు భారీ సినిమాలు వరసగా డిజాస్టర్ కావడంతో, గోల్డెన్ లెగ్ కాస్తా ఐరన్ లెగ్ గా మారిపోయింది. పవన్ తో సర్దార్ గబ్బర్ సింగ్, మహేష్ తో బ్రహ్మోత్సవం లాంటి సినిమాలు అట్టర్ ఫ్లాపులుగా మిగలడంతో ఈ సమ్మర్ తనకు పుష్ ఇస్తుందని ఆశలు పెట్టుకున్న చందమామకు నిరాశే ఎదురైంది. మరి ఈ ఫ్లాపులను మీరు ఎలా భావిస్తున్నారు అన్న ప్రశ్నకు, నేను ఫ్లాపులను పట్టించుకోను. హిట్స్ తలకెక్కించుకోను. మన పని మనం చేసుకుపోవాలి తప్ప, ఇంకేమీ ఆశించకూడదు అంటూ సమాధానం ఇస్తోంది. సినిమాలు ఫ్లాపైనా, నా పాత్రకు చాలా మంచి పేరే వచ్చింది కదా అంటూ సమాధానం ఇస్తోంది . ఇక ఇప్పుడు ఈ అమ్మడి చూపంతా బాలీవుడ్ లో చేసిన దో లఫ్జోంకీ కహానీ సినిమా మీదే ఉన్నాయి. జూన్ 10 న రిలీజవుతున్న ఈ సినిమా అయినా, కెరీర్ కు కాస్త బూస్టప్ ఇస్తుందని భావిస్తోంది. మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



