మైసూర్ కు వెళ్లనున్న మనం
on Dec 9, 2013
అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కలిసి నటిస్తున్న చిత్రం "మనం". ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. త్వరలోనే మరో షెడ్యుల్ మైసూరులో ప్రారంభించనున్నారు. ఇందులో నాగార్జున, నాగచైతన్యలతో పాటు హీరోయిన్స్ సమంత, శ్రియలు పాల్గొననున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. అనూప్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. త్వరలోనే ఆడియో విడుదల కార్యక్రమం చేయనున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
