మహేష్ యంగ్ గా ఉండటం వెనుక రహస్యం..!
on May 18, 2016

బ్రహ్మోత్సవం పోస్టర్లు, టీజర్లు చూసిన వాళ్లకు ఒకటి మాత్రం క్లియర్ గా కనిపిస్తోంది. శ్రీమంతుడు కంటే కూడా అందంగా ఈ సినిమాలో మహేష్ కనబడుతున్నాడు. ముఖ్యంగా కొన్ని సాంగ్ టీజర్లలో అయితే, పాతికేళ్ల కుర్రాడిలా మెరిసిపోతున్నాడు. హాలీవుడ్ హీరో రేంజ్ అని తనకున్న పేరుకు తగ్గట్టే మహేష్ ఈ సినిమాలో కనబడుతున్నాడు. అయితే నలభై దాటిన తర్వాత కూడా ఇంత అందంగా కనిపించడం వెనుక సీక్రెట్ ఏంటా అని మహేష్ ను ఒక ఇంటర్వ్యూలో అడిగితే ఆ రహస్యం గుట్టు విప్పేశాడు. సినిమా రిలీజ్ టైంలో తప్ప, తాను పెద్దగా టెన్షన్ పడడట. మనసులోకి చెడు ఆలోచనల్ని రానివ్వకపోవడం, ఎప్పుడూ తనను తాను ప్రశాంతంగా ఉంచుకోవడమే ఫేస్ లో గ్లో వెనుక అసలు కారణం అని చెబుతున్నాడు మహేష్. టెన్షన్స్ ను దగ్గరికి రానివ్వకపోవడం, కుటుంబంతో ఎక్కువ సేపు గడపడం నన్ను చాలా ఫ్రెష్ గా ఉంచుతున్నాయి. బహుశా అవే నన్ను తెరపైన కాస్త అందంగా చూపిస్తున్నాయేమో అంటూ సిగ్గుపడిపోతున్నాడు. ఒకప్పుడు మహేష్ కు సిగరెట్ అలవాటు ఉండేది. చాలా కష్టపడి అలాంటి అలవాట్లన్నింటినీ దూరం చేసుకున్న మహేష్, ప్రస్తుతం మిస్టర్ పెర్ఫెక్ట్ గా మిగిలిన హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



