కాటమరాయుడి కోసం కంపెనీల హాలీడేలు
on Mar 24, 2017
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్..ఈ పేరు వినిపించినా..కనిపించినా అభిమానులు పూనకంతో ఊగిపోతారు. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ సొంతం. మరి ఆయన సినిమా విడుదల రోజు పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..అభిమానులకు ఆ రోజు పండగరోజు. ఇవాళ పవన్ నటించిన కాటమరాయుడు రిలీజ్ అవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లోని ధియేటర్ల వద్ద సందడి నెలకొంది..ఆ రోజు ఆఫీసులున్నా..ఎన్ని పనులున్నా సరే ఫస్ట్ డే మార్నింగ్ షో చూడాల్సిందే..ఇది ఎన్నో ఏళ్లుగా జరుగుతూనే ఉంది..అయితే ఆ రోజు తమ సిబ్బంది ఆఫీసులకు హాజరవ్వరని ముందే ఊహించిన కొన్ని ఐటీ కంపెనీలు శుక్రవారం సెలవు ఇచ్చేశాయి..అయితే ఆదివారం వర్కింగ్ డేగా ప్రకటించాయి. ఇంతకు ముందు సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి రిలీజ్ రోజు కొన్ని ఐటీ కంపెనలీలు సెలవు ప్రకటించడంతో పాటు తమ సిబ్బంది కోసం టిక్కెట్లు కూడా బుక్ చేశాయి.