కాజల్‌ని మర్చిపోతున్నారా?
on Mar 20, 2015
.jpg)
ఒకప్పుడు వరుస చిత్రాలతో ఓ వెలుగు వెలిగింది కాజల్. చేసిన హీరోతోనే మళ్లీ మళ్లీ చేసి.. హిట్ పెయిర్ అనిపించుకొంది. అయితే ఇప్పుడు ఆమె హవా బాగా తగ్గిపోయింది. నయా కథానాయికల మధ్య నిలబడలేకపోతోంది. తెలుగులో ఆమె ఖాతాలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదు. `టెంపర్` హిట్టయినా కాజల్ ని ఎవ్వరూ పట్టించుకోలేదు. అయితే బాలీవుడ్ లో ఓ అవకాశం అందడం కాజల్‌కి ఊరటనిచ్చే విషయం. అక్కడ దోలఫ్టోకీ కహానీ అనే చిత్రంలో నటించే అవకాశం దక్కించుకొంది. ఇది పూర్తిగా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర అట. ఈ సినిమాతో తన జాతకం తిరగబడడం ఖాయం అంటోంది కాజల్. దాంతో పాటు తమిళంలో ఓ అవకాశం అందుకొంది. విక్రమ్ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఇవి మినహా మరే చిత్రాలూ లేవు. ``నా హవా తగ్గిపోయిందన్నమాట నేను నమ్మను. సినిమాల్లేక ఎప్పుడూ నేను ఖాళీగా లేను. తెలుగో, హిందీనో ఏదో ఒకటి చేస్తున్నా కదా`` అంటూ సమాధానం ఇస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



