`NTR 30`.. ఇంట్రెస్టింగ్ రోల్ లో తారక్?
on Apr 17, 2021
`జనతా గ్యారేజ్` వంటి సెన్సేషనల్ హిట్ తరువాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. `NTR 30` అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. జూన్ ద్వితీయార్ధంలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ పాన్ ఇండియా వెంచర్.. 2022 ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో సందడి చేయనుంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో తారక్ పాత్రకి సంబంధించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. ఇందులో అమాయక చక్రవర్తి తరహా వేషంలో ఎన్టీఆర్ కనిపిస్తారట. పల్లెటూరిలో అమాయకంగా తిరిగే ఓ యువకుడు ఒకనొక సందర్భంలో సిటీకి వస్తే.. అక్కడ ఏం జరుగుతుంది? ఆ తరువాత అతను ఎలా మారతాడు? అనే పాయింట్ తో ఈ సినిమా నడుస్తుందట. కొరటాల గత చిత్రాల తరహాలోనే సందేశం మిళితమైన వాణిజ్యాత్మక కథతో `NTR 30` ఉంటుందని బజ్. మరి.. ఈ కథనాల్లో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.