రెమ్యూనరేషన్ గురించి ఆలోచించాలనిపిస్తుంది...!
on Jul 8, 2017
.jpg)
బుల్లితెరపై త్వరలో రానున్న బిగ్ బాస్ రియాలిటీ షోకు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకు సంబంధించి ఇప్పటికే పలు ప్రోమోలు విడుదల చేశారు. ఇప్పుడు తాజాగా ఈ షోకు సంబంధించి ట్రైలర్ ను విడుదల చేశాడు. ఈ సందర్బంగా పలువురు మీడియా ప్రతినిధులు ఎన్టీఆర్ ను పలు ప్రశ్నలు అడుగగా.. వాటికి ఆయన సమాధానం చెప్పాడు. దీనిలో భాగంగానే పారితోషికం గురించి ఆయనను ప్రశ్నించగా.. దీనికి ఎన్టీఆర్ బిగ్ బాస్ రియాలిటీ షోకు తనకు భారీ రెమ్యూనరేషన్ ఇస్తున్నారని కథనాలు వచ్చాయని.. ఇంతవరకు రెమ్యూనరేషన్ గురించి ఏనాడూ పెద్దగా ఆలోచించలేదు..మీరు అడుగుతుంటే నిజంగానే రెమ్యునరేషన్ గురించి ఆలోచించాలనిపిస్తుందని అన్నాడు. నాకు ఛాలెంజెస్ అంటే ఇష్టం.. నేను ప్రతి విషయాన్ని ఛాలెంజింగ్ తీసుకుంటా..అందుకే షో నిర్వాహకులు నన్ను సంప్రదించగానే ఒప్పుకున్నా అని చెప్పాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



