Home

»

Latest News

సోమవారం 'ఆగాడు'..!

Sep 24, 2014 4:02PM

వీకెండ్ మూడు రోజులు కలెక్షన్లు దులిపేసిన 'ఆగడు' ఒక్కసారిగా బోల్తాపడ్డాడు. సోమవారం నైజాం మొత్తం మీద ఈ సినిమా నలభై లక్షల వరకు వసూలు చేసిందట. ఈ సినిమా కలెక్షన్లు భారీగా పడిపోవడంతో ప్రొడ్యూసర్లు షాక్ తిన్నారట. 'ఆగడు' కన్నా రవితేజ పవర్ ఎక్కువ కలెక్షన్లు రాబట్టడం చూసి యూనిట్ సభ్యులు ఆశ్చర్యపోతున్నారట. మరోవైపు మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం శ్రీనువైట్లపై గరంగరంగా వున్నారు. 'ఆగడు చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా శ్రీనువైట్ల ఒక ఛానెల్ కు విచ్చేయగా లైవ్ షోలో మహేష్ ఫ్యాన్స్ శ్రీను వైట్లపై విమర్శల వర్షం కురిపించారు. “ఆగడు” చిత్రం “గబ్బర్ సింగ్”, “దూకుడు” చిత్రాల కలయికలా ఉందని వారంటున్నారు. ఇంకొందరేమో “దూకుడు” డీవీడీ వెర్షన్ లో చూసినట్లుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో సినిమా వాళ్ళు చానెళ్లకు వెళ్లడానికి కూడా జంకుతున్నట్లు తెలుస్తోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com