హృతిక్ రోషన్ సినిమాపై కేసు..!
on May 23, 2016

ఇండస్ట్రీలో కథలు లేకపోవడంతో, అరువు కథలు డబ్బింగ్ సినిమాల కథలే దిక్కవుతున్నాయి ఇప్పుడు. అయితే కొంత మంది రచయితలు, సినిమాల్లో కథ తమదేనని, కాపీ కొట్టారని కేసులు వేయడం చూస్తూనే ఉన్నాం. మొన్నీ మధ్యే మెగాస్టార్ కత్తి సినిమాకు కూడా ఈ వివాదం రేగింది. ప్రస్తుతం ఇదే ఇష్యూ హృతిక్ రోషన్ క్రిష్ 3 కి ఎదురైంది. మూడేళ్ల క్రితం హృతిక్ రోషన్ హీరోగా, క్రిష్ సీరీస్ లో సీక్వెల్ గా వచ్చింది క్రిష్ 3. సినిమా అట్టర్ ఫ్లాప్ టాక్ తో పాటు, పెట్టుబడిలో సగం కూడా వెనక్కి తెచ్చుకోలేకపోయింది. ఈ సినిమా పై లేటెస్ట్ గా ఒక రచయిత కేసు పెట్టాడు. రూప్ నారాయణ్ అనే రచయిత, తను రాసిన సూఅర్దాన్ అనే నవల నుంచి క్రిష్ 3 ని కాపీ కొట్టారని, 2010లోనే తాను ఈ పుస్తకాన్ని రాసేశానని పముంబై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాడు. మనిషికి జంతువుకు క్రాస్ బ్రీడ్ లా ఉండే మాన్వర్ అనే జంతువును తన నవలలో రాశానని, అదే కాన్సెప్ట్ ను క్రిష్ 3లో వాడేసుకున్నారని ఫిర్యాదు చేశాడు రచయిత. దీంతో దర్శకనిర్మాతలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



