రామ్ చరణ్ - సుకుమార్ సినిమా పేరు ఇదేనా..?
on May 23, 2016

రామ్ చరణ్ తో సుకుమార్ ఒక సినిమాను ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇది సైన్స్ ఫిక్షన్ మూవీ అంటూ వార్తలు వచ్చాయి. తాజాగా సినిమాకు టైటిల్ అంటూ ' ఫార్ములా X ' అనే పేరు ప్రచారమౌతోంది. అసలు సినిమా నిజంగానే సైఫై నా కాదా అనేది స్పష్టత లేకుండానే, టైటిల్ హల్ చల్ చేయడం విచిత్రం. తనకు బాగా సింక్ అయ్యే దేవి శ్రీ ప్రసాద్ నే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకున్నాడు సుకుమార్. ప్రస్తుతం సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ధృవ సినిమాతో చెర్రీ బిజీగా ఉండగా, సుకుమార్ తన సినిమాకు ప్రీప్రొడక్షన్, స్క్రిప్ట్ పనులు పూర్తిచేస్తున్నాడట. ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థే ఈ సినిమాను నిర్మిస్తారని, చిరు బర్త్ డే అయిన ఆగష్ట్ 22న సినిమా ప్రారంభోత్సవం జరుగుతుందని, వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను తెరపైకి తెచ్చే ఆలోచనలో ఉన్నారని ఫిల్మ్ నగర్ సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



