సెప్టెంబర్ 26న 'గోవిందుడు..' సెన్సార్
on Sep 23, 2014
మెగా పవర్ స్టార్ రాంచరణ్ ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా అక్టోబర్ 1న విడుదల చేయాలని పట్టుదలతో వున్నాడు నిర్మాత బండ్ల గణేష్. దీని కోసం చిత్ర యూనిట్ సభ్యులు కూడా బాగా కష్టపడుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరినట్లుగా తెలిసింది. రామ్ చరణ్ కూడా పగలు షూటింగ్ లో పాల్గొంటూ రాత్రి పూట డబ్బింగ్ వర్క్ ఫినిష్ చేస్తున్నాడు. సెప్టెంబర్ 26న సినిమా సెన్సార్ బోర్డు ముందుకు వెళ్తుందని సమాచారం. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లకు మంచి స్పందన వస్తోంది. గతంలో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన కుటుంబకథా చిత్రం తరహాలో తెరకెక్కుతున్న ‘గోవిందుడు అందరివాడేలే’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
