నాగార్జునకు బ్లాక్‌బస్టర్ స్టొరీ కావాలట..!
on Sep 23, 2014
నాగార్జున కొడుకు అఖిల్ మూవీ ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందో తెలీదుగానీ, దానికి సంబంధించిన రకరకాల వార్తలు మాత్రం బయటకు వెలువడుతూనే వున్నాయి. ప్రస్తుతం నాగార్జున వీవీ.వినాయక్ తో స్టోరీ చర్చలు జరుపుతున్నట్టు టాలీవుడ్ టాక్. అయితే కథ తనకి వంద శాతం సంతృప్తిని ఇచ్చేవరకు ఈ చిత్రాన్ని మొదలు పెట్టకూడదని నాగార్జున నిర్ణయించుకున్నారు. ఎందుకంటే జోష్ చిత్రంతో నాగ చైతన్యని పరిచయం చేయడం మిస్టేక్ నాగ్ పలుసార్లు చెప్పారు. అఖిల్ విషయంలో అలా జరగకూడదని నాగ్ కేర్ తీసుకుంటున్నారట. అందుకనే అఖిల్ మూవీ గురించి ఇంతవరకు ప్రకటన చేయలేదట. అఖిల్ కి మంచి బ్లాక్‌బస్టర్ కథ దొరికిన తరువాతే ఈ చిత్రం సెట్స్ మీదకి వెళ్లనున్నట్లు సమాచారం. దీనికోసం వినాయక్ కూడా మంచి కథను రెడీ చేసే పనిలో నిమగ్నమయ్యాడట.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
