గో గ్రీన్... కాజల్‌కి కాబోయే భర్త సందేశం
on Oct 16, 2020
ప్రముఖ కథానాయిక కాజల్ అగర్వాల్ ఈ నెలాఖరున ఓ ఇంటి ఇల్లాలు కాబోతున్న సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన వ్యాపారవేత్త, చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూని ఆమె పెళ్లి చేసుకోనున్న సంగతి తెలిసిందే. వృత్తిరీత్యా అతను ఇంటీరియర్ డిజైనర్. అలాగే, ప్రకృతికి ప్రాముఖ్యం ఇస్తాడని తెలుస్తోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 'గో గ్రీన్' అని గౌతమ్ ఓ సందేశం ఇచ్చారు. మనుషులకు ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ ఇచ్చే పచ్చటి మొక్కలను పెంచాలనేది ఆయన ఆలోచనగా తెలుస్తోంది. మనం ఆధారపడిన ఈ ప్లానెట్ ని రక్షించుకోవడం చాలా ముఖ్యమని గౌతమ్ కిచ్లూ అన్నారు.
కాజల్, గౌతమ్ వివాహం నెలాఖరున 30వ తేదీన ముంబైలో జరగనుంది. తొలుత ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో జరుగుతుందని వార్తలు వచ్చాయి. తరవాత ఇంటిలో కుటుంబ సభ్యుల మధ్య వివాహ వేడుక జరపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. పెళ్లి వేదిక గురించి కాజల్ ఇంకా స్పందించలేదు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
