రవితేజతో 'జర్ర జర్ర' భామ ఐటమ్ సాంగ్!
on Oct 16, 2020
'జర్ర జర్ర...' ఐటమ్ సాంగ్ గుర్తుంది కదా!? వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన 'గద్దలకొండ గణేష్' సినిమాలో ఆ పాట మాస్ ప్రేక్షకులకు అమితంగా నచ్చింది. అందులో తెలుగు అమ్మాయి డింపుల్ హయాతి హాట్ హాట్‌గా కనిపించి చిత్ర పరిశ్రమతో పాటు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. 'జర్ర జర్ర...' తరవాత ఆమెకు అవకాశాలు వస్తాయని అందరూ ఆశించారు. కానీ, ఎందుకో రాలేదు. ఇన్నాళ్లకు ఆమెకు మరో అవకాశం వచ్చిందని ఫిలింనగర్ టాక్. ఈసారి కూడా ఐటమ్ సాంగ్ చేసే ఛాన్స్ వచ్చిందట.
మాస్ మహారాజ్ రవితేజ కథానాయకుడిగా రమేష్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ ఒక సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే. విజయదశమి సందర్భంగా ఈ నెలలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో కథానాయిక పాత్రలకు నిధి అగర్వాల్, అనూ ఇమ్మాన్యుయేల్, మీనాక్షి చౌధురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఐటమ్ సాంగ్ కోసం డింపుల్ హయాతిని ఎంపిక చేశారట. ఇటీవల లుక్ టెస్ట్ కూడా చేశారని సమాచారం.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
