ఈ ఏడాది నాలుగు అద్భుతాలు
on Aug 1, 2017

దర్శకుడు బోయపాటి శ్రీను కథ చెప్పే విధానం చూస్తే.. ఎదురున్నవారికి భయం వేస్తుందట. అంత ఎమోషనల్ గా కథ చెబుతాడట ఆయన. మన టాలీవుడ్ హీరోలు కొందరు బోయపాటి కథ నేరేట్ చేసే తీరు గురించి పలు సందర్భాల్లో మీడియా ముందు చెప్పారు కూడా. మాస్ సినిమాలో తీయడం మాస్టర్ అనిపించుకున్న బోయపాటి.. నిజానికి మంచి వక్త కూడా. ‘జయ జానకీ నాయక’ఆడియో వేడుకలో ఆయన ఓ ఆసక్తికరమైన విషయాన్ని చాలా అందంగా చెప్పాడు. ‘ఈ ఏడాది తెలుగు సినిమాకు చాలా ప్రత్యేకం. ఏడాది ప్రథమార్థంలోనే నాలుగు అద్భుతాలు జరిగాయి. అందులో మొదటిది మహాదర్శకుడు కె.విశ్వనాథ్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం రావడం. రెండోది... మన ‘బాహుబలి 2’ సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు రావడం, మూడు... నా ‘లెజెండ్’ సినిమా ఓకే థియేటర్లో వెయ్యి రోజులకు పైగా ప్రదర్శితమవ్వడం. ఇక చివరిది ఏంటంటే... ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగాస్టార్ రీ ఎంట్రీ ఈ ఏడాదే జరగడం.. 150 సినిమాతో 150 కోట్లు కొల్లగొట్టడం. నిజంగా ఈ ఏడాది’అన్నీ శుభాలే అని ఆనందం వ్యక్తం చేశాడు బోయపాటి. తను చెప్పడం కాదు కానీ... ఆయన చెప్పినవాటిలో నిజం లేకపోలేదు. ఏమంటారు?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



