దిల్ రాజు.. నయా రీమేక్స్ రారాజు!
on Jul 15, 2020
టాలీవుడ్లో ‘దిల్’ సినిమాతో నిర్మాతగా వి. వెంకటరమణారెడ్డి అలియాస్ దిల్ రాజు జర్నీ మొదలైంది. మొదటి సినిమా నుండి ఆయనది ఒకటే పద్దతి అని తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ టాక్ ఉంది. రైటర్స్, డైరెక్టర్స్‌తో దగ్గరుండి మరీ స్ర్కిప్ట్ వర్క్ చేయించుకుంటారని! టాక్‌కి తగ్గట్టు తెలుగులో 25 ఫిలిమ్స్ మైల్స్టోన్ వరకూ స్ట్రయిట్ కథలతో సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. కానీ, రీసెంట్గా ఆయన రీమేక్స్ రారాజు ముద్ర వేయించుకుంటున్నారు.
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’. హిందీ హిట్ ‘పింక్’కి రీమేక్‌గా తెరకెక్కుతోంది. అంతకు ముందు రాజ్‌తరుణ్ హీరోగా ప్రొడ్యూస్ చేసిన ‘ఇద్దరి లోకం ఒక్కటే’ ఫారిన్ సినిమాకు రీమేక్. అప్పట్లో రీమేక్ లేకపోతే పవన్‌తో సినిమా డ్రీమ్ నెరవేరేది కాదని ఆయన సమర్ధించుకున్నారు. ఇప్పుడు వరుసపెట్టి రీమేక్స్ అనౌన్స్ చేస్తున్నారు.
విశ్వక్సేన్ హీరోగా నాని ప్రొడ్యూస్ చేసిన ‘హిట్’ను మరో నిర్మాతతో కలిసి హిందీలో ‘దిల్’ రాజు రీమేక్ చేస్తున్నారు. ‘జెర్సీ’ని అల్లు అరవింద్, ఇంకా ఎవరితోనో కలిసి చేస్తున్నారు. తెలుగులో ఆయనే నిర్మించిన ‘డీజే’ను హిందీలో మరొకరితో కలిసి రీమేక్ చేస్తున్నారు. స్ట్రయిట్ కథలపై కాన్సంట్రేట్ చేయడం మానేసి రీమేకుల మీద పడ్డారేంటో?