English | Telugu

రాజుకి.. నితిన్‌కు ఇన్నాళ్లకి కుదిరింది

on Nov 14, 2017

దిల్.. అప్పటి వరకు బడా డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న దిల్‌రాజును స్టార్ ప్రొడ్యూసర్‌గా.. నితిన్‌కు స్టార్ ఇమేజ్‌ను తీసుకువచ్చిన సినిమా. 2003లో వివి. వినాయక్ దర్శకత్వంలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అన్ని రకాల కమర్షియల్ అంశాలు దండిగా ఉండటంతో ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. రూ. 2.5 కోట్లతో తెరకెక్కిన ఆ సినిమా 11 కోట్లు వసూలు చేసి.. 91 కేంద్రాల్లో అర్థ శతదినోత్సవాన్ని జరుపుకుంది. ఆ తరువాత దిల్‌రాజు-నితిన్ మధ్య సినిమా రాబోతోందని ఎన్నో పుకార్లు వచ్చినప్పటికీ అవేవి కార్యరూపం దాల్చలేదు. అయితే 14 సంవత్సరాల తర్వాత మళ్లీ ఈ కాంభినేషన్ రిపీట్ కాబోతోందట. తన బ్యానర్‌లో శతమానం భవతి వంటి సూపర్ హిట్టిచ్చిన సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో దిల్‌రాజు ఓ సినిమా చేయబోతున్నాడట.. సతీశ్ చెప్పిన కథ రాజుగారికి బాగా నచ్చడంతో నితిన్‌కు వినిపించాడట.. అందుకు హీరో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అతి త్వరలో సెట్స్ మీదకు తీసుకువెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు దిల్‌రాజు. ఈ మూవీకి శ్రీనివాస కళ్యాణం అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు టాక్.

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here