దుబాయ్‌లో దిల్ రాజు రెండో పెళ్లి?!
on Feb 14, 2020

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ కొద్ది రోజులుగా ఆన్‌లైన్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇది రూమర్ కాదనీ, నిజమేననీ ఫిలింనగర్ వర్గాలు తెలిపాయి. 49 ఏళ్ల రాజు వివాహం చేసుకోనున్న యువతి వయసు 30 సంవత్సరాలనీ, ఆమె ఫ్యామిలీ ఫ్రెండ్ అనీ తెలియవచ్చింది. తాజాగా చక్కర్లు కొడుతున్న ప్రచారం ప్రకారమైతే, వారి వివాహం శనివారం (ఫిబ్రవరి 15) దుబాయ్‌లో జరగనున్నది. ఇందులో వాస్తవం ఎంతున్నది మాత్రం తెలియరాలేదు.
దిల్ రాజు భార్య అనిత 2017 మార్చిలో గుండె ఆగి మృతిచెందారు. వారి కుమార్తె వివాహమై, రాజు తాతయ్య కూడా అయ్యారు. రెండేళ్ల కాలంగా జీవితంలో తోడు లేకుండా గడుపుతున్న రాజుకు సన్నిహితులు రెండో పెళ్లి చేసుకోమంటూ సలహా ఇస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇతర కుటుంబసభ్యులు కూడా దీని బలపరిచినందునే రాజు కూడా ఈ వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వినిపిస్తోంది. కొంతమంది సన్నిహిత బంధువులు, స్నేహితుల సమక్షంలో నిరాడంబరంగా ఈ వివాహం జరుగుతుందనీ, ఆ తర్వాత హైదరాబాద్‌లో రాజు రిసెప్షన్ ఏర్పాటు చేస్తారనీ వినికిడి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



