English | Telugu

ఆడే సినిమా వ‌స్తే ఆడుకుంటాడు నాని

on Apr 23, 2019

 

నాని హీరోగా న‌టించిన చిత్రం జెర్సీ. ఈ చిత్రం ఇటీవ‌ల విడుద‌లై విమ‌ర్శ‌కులు ప్ర‌శంస‌లందుకుంటోంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం ద‌స్ ప‌ల్లా హోట‌ల్ లో సినిమా న‌చ్చి ఆ సినిమాకు సంబంధించిన టీమ్ ను అభినందించ‌డానికి అభినంద‌న స‌భ ఏర్పాటు చేసారు ప్ర‌ముఖ నిర్మాత  దిల్ రాజు. ఈ కార్య‌క్ర‌మంలో ముందుగా దిల్ రాజు మాట్లాడుతూ...``రిలీజ్ కు మందే సినిమా చూసి ...సినిమా పెద్ద రేంజ్ కి వెళ్తుంది అని చెప్పా. అలాగే విడుద‌ల రోజు మొద‌టి ఆట నుంచి సినిమాకు మంచి టాక్ వ‌చ్చింది.  ఈ సినిమాను అంద‌రూ గొప్ప‌గా మెచ్చుకుంటున్నారు చాలా హ్యాపీగా అనిపించి. ఇంత గొప్ప సినిమా చేసిన టీమ్ అప్రిషియేట్ చేయాల‌నుక‌న్నా.  ఈ అభినంద‌న స‌భ ఏర్పాటు చేయ‌డానికి ముఖ్య కార‌ణం ముగ్గురు వ్య‌క్తులు.. వాళ్లే... ఒక‌రు నేచ‌ర‌ల్ స్టార్ నాని, మ‌రొక‌రు నిర్మాత‌, మూడో వ్య‌క్తి ద‌ర్శ‌కుడు గౌత‌మ్.  నాని అంద‌రూ చెప్పిన‌ట్టు గొప్ప న‌టుడే. ఆయ‌న ఆడే సినిమాల‌లో అద్భుతంగా న‌టిస్తాడు. నిర్మాత మొద‌ట్లో టెన్ష‌న్ ప‌డ్డా...త‌ర్వాత చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇక ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మ‌ళ్లీ రావా చూసాను. చాలా బాగా తీసాడు. ఇక  రెండో సినిమానే అద్భుతంగా డీల్ చేసాడు. క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చాలా వ‌స్తాయి. కానీ, మంచి సినిమాలు చాలా అరుదు. ఇక హీరోయిన్, చిన్న‌పిల్లాడు, స‌త్యరాజ్ గార్ల‌తో ద‌ర్శ‌కుడు అద్భుతంగా చేయించాడు. ఇంత పెద్ద స‌క్సెస్ కు కార‌ణం ద‌ర్శ‌కుడు గౌత‌మ్ అన‌డం సందేహం లేదు`` అన్నారు.


Cinema GalleriesLatest News


Video-Gossips