'దిల్' రాజు 'నిల్' రాజు అయ్యాడా?
on Oct 16, 2014

టాలీవుడ్ లో వరుస హిట్లు కొట్టి గోల్డెన్ హ్యాండ్ గా పేరు సంపాదించుకున్న నిర్మాత దిల్ రాజు. ప్రస్తుతం ఆయన భారీ నష్టాలలో వున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పరిశ్రమకు చెందిన పెద్దలు కొంతమంది సినిమా ఇండస్ట్రీలలో ఎక్కువకాలం సక్సెస్ లు తోడురావని అంటుంటారు. ప్రస్తుతం దిల్ రాజు పరిస్థితి కూడా అదే విధంగా వుందని అంటున్నారు. ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా షాక్ తరువాత పెద్ద సినిమాల నిర్మాణానికి బ్రేక్ ఇచ్చి, డిస్ట్రిబ్యూషన్‌లో జోరు పెంచాడు దిల్ రాజు. కానీ ఇక్కడ కూడా అతనికి అదృష్టం వరించలేదు. దసరా సీజన్ లో అతను డిస్ట్రిబ్యూషన్ చేసిన బడా సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. దీంతో దిల్ రాజు భారీ అప్పులలో కురుకుపోయాడని ఫిల్మ్ నగర్ టాక్. దాని వల్ల అతను నిర్మిస్తున్న చిన్న సినిమాను కూడా వాయిదా వేశాడని అంటున్నారు. అయితే 'దిల్' రాజు నిజంగానే 'నిల్' రాజుగా మారాడా? లేక ఇవన్నీ ఇండస్ట్రీ వర్గాల పుకార్లా అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే..!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



