ఆర్జీవీ కలకలం.. 'పవర్‌స్టార్' నిజంగా ఆ డైరెక్టర్‌ను కొట్టాడా?
on Jul 11, 2020
సెక్స్, న్యూడ్, క్రైమ్, పాలిటిక్స్.. ఇవీ రామ్‌గోపాల్ వర్మ ఇప్పుడు తీస్తున్న సినిమాల్లోని మెయిన్ ఎలిమెంట్స్. 'నగ్నం' అనే టైటిల్‌తోటే ఓ షార్ట్ ఫిలిమ్ తీసి తన ఆర్జీవీ థియేటర్‌లో రిలీజ్ చేసి ఆయన సొమ్ము చేసుకొన్నాడు. దానికి ముందు ఆయన తీసిన 'క్లైమాక్స్' మూవీ కూడా సెక్స్, న్యూడ్ ప్రధానంగా రూపొందినదే. తన సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేస్తుంటే జనం ఆదరించకపోవడం, లాభాలు రాకపోతుండటంతో, లాభం లేదని ఆర్జీవీ థియేటర్ అనే ఏటీటీ ప్లాట్‌ఫామ్‌ను స్టార్ట్ చేశాడు. పైగా దీనివల్ల ఇంకో సౌలభ్యం కూడా ఉంది. అది.. సెన్సార్ సమస్య లేకపోవడం! 'లక్ష్మీస్ ఎన్టీఆర్', 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' (తర్వాత 'అమ్మరాజ్యంలో కడపబిడ్డలు'గా టైటిల్ మారింది) సినిమాలకు సెన్సార్ బోర్డుతో చిక్కులు రావడంతో ఆ ఇబ్బందిలేని ఏటీటీ ప్లాట్‌ఫామ్‌ను ఆయన ఎంచుకున్నాడు.
ఇప్పుడు మరోసారి రాజకీయాలపై దృష్టిపెట్టిన వర్మ.. లేటెస్ట్‌గా 'పవర్‌స్టార్' అనే ఏటీటీ సినిమా తీస్తున్నాడు. తనదైన శైలిలో ఇది నిజ జీవితంలోని ఏ వ్యక్తి కథ కాదనీ, ఒకవేళ అలాంటి పోలికలు కనిపిస్తే.. అది కేవలం కాకతాళీయమేననీ అంటున్నా.. ఇది పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి తీస్తున్న సినిమా అని చిన్న పిల్లాడికి కూడా తెలిసిపోతోంది. కాగా కొద్ది రోజులుగా ఈ సినిమాకు సంబంధించి ఆర్జీవీ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేస్తున్న ఫొటోలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ పోలికలున్న క్యారెక్టర్ ఫొటోను రిలీజ్ చేసిన ఇప్పుడు పవర్‌స్టార్ ఒక డైరెక్టర్‌ను కొడుతున్న ఫొటోను షేర్‌చేసి మరింత కలకలం రేపాడు. నాలుగేళ్ల క్రితం 'సర్దార్ గబ్బర్‌సింగ్' డైరెక్టర్ బాబీని పవన్ కల్యాణ్ కొట్టాడంటూ ఆన్‌లైన్‌లో జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అందులో నిజం ఎంత ఉందో వాళ్లకే తెలుసు.
ఇప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేసేలా వర్మ షేర్ చేసిన ఫొటోలున్నాయి. దీంతో నిజంగానే ఆ డైరెక్టర్‌ను పవర్‌స్టార్ కొట్టాడా? అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు ఫ్యాన్స్. "An angry heated moment between an actor and a director in POWER STAR" అంటూ తను షేర్ చేసిన ఫొటోకు పోస్ట్ పెట్టాడు ఆర్జీవీ. ఏదేమైనా తను అనుకున్నది తీయడం, అది నిజ జీవితంలో ఎవరికైనా సంబంధించినట్లు కనిపిస్తే.. కేవలం కాకతాళీయమే తప్ప, అందులో తనకు బాధ్యత లేదని తప్పించుకోవడం ఆయన నైజంగా మారడం మనం చూస్తూనే ఉన్నాం. పవర్‌స్టార్‌తోనూ ఆయన ఈ ఆటే ఆడుతున్నాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
