English | Telugu

అదిరెను ఆ ఇద్దరి స్టైలే!

on Aug 21, 2019

 

"లుక్‌లోనే అంతా ఉంది" అంటున్నారు ఇప్పటి హీరోలు. యంగ్ జనరేషన్ హీరోస్ ఒక్కో సినిమాకు ఒక్కో లుక్‌తో దర్శనమిస్తూ యూత్‌లో క్రేజ్ సంపాదించుకుంటున్నారు. కొత్త కొత్త ఫ్యాషన్ స్టైల్స్‌తో అదరగొడుతున్నారు. కేరెక్టర్‌లో ఇమిడిపోవాలంటే లుక్ కూడా దానికి తగ్గట్లే ఉండాలని వాళ్లు కోరుకుంటున్నారు. గతంలో టాప్ స్టార్స్ జెనరల్‌గా ఒకే లుక్‌తో కనిపించేవాళ్లు. ఎప్పుడో కానీ స్టైల్ మార్చేవారు కాదు. ఆ రోజులకు కాలం చెల్లిపోయింది. ఇప్పుడు సీనియర్ స్టార్లు సైతం లుక్, స్టైల్ విషయంలో యంగ్ హీరోలతో పోటీకి సై అంటున్నారు.
లేటెస్ట్‌గా ఇద్దరు టాప్ సీనియర్ స్టార్స్ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఇద్దరు స్టార్స్.. చిరంజీవి, బాలకృష్ణ. క్లీన్ షేవ్, కళ్లకు జోడు పెట్టుకొని యంగ్ లుక్‌తో చిరంజీవి అబ్బురపరిస్తే, 'వాన్ డైక్ బియర్డ్' లుక్‌తో బాలయ్య అదరగొట్టేశారు. ఈ ఇద్దరూ తమ లుక్స్‌తో యంగ్ స్టార్స్‌కే సవాలు విసురుతున్నట్లున్నారు.
'సైరా' సినిమా షూటింగ్ కంప్లీటై, అక్టోబర్ 2న రిలీజ్‌కు రెడీ అవుతుండగా, నెక్స్ట్ మూవీ కోసం తన రూపాన్ని మార్చేసుకుంటున్నారు చిరంజీవి. ఇప్పటివరకూ నాలుగు సినిమాలు తీసి, ఓటమి తెలీని డైరెక్టర్‌గా రాణిస్తోన్న కొరటాల శివతో సినిమా చెయ్యడానికి చిరు రెడీ అవుతున్నారు. ఆ సినిమాలోని హీరో కేరెక్టర్ రూపం ఎలా ఉంటుందో బొమ్మల రూపంలో శివ చూపించడంతో దానికి తగ్గట్లు యంగ్ లుక్‌లోకి మారిపోయారు చిరంజీవి. ఆ లుక్‌లో ఆయనను చూస్తుంటే 64 ఏళ్ల వయసున్న వ్యక్తి అని ఎవరూ అనుకోరు. సాధారణంగా ఆరు పదులు దాటిన వ్యక్తిని వృద్ధుడని పిలుస్తాం. కానీ చిరంజీవికి ఆ పదం వాడటం అసందర్భంగా అనిపిస్తుంది. లైఫ్ స్టైల్, డిసిప్లిన్‌తో ఆయన తన రూపాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కళ్లకు జోడు, క్లీన్ షేవ్‌తో ఆయన యంగ్ స్టార్ లాగే ఉన్నారు. వచ్చే ఏడాది రిలీజయ్యే ఈ సినిమాతో చిరంజీవి ఏం మాయ చేస్తారో చూడాలి. ఆగస్ట్ 22న ఆయన 65వ ఏట అడుగుపెడుతుండటం గమనార్హం.
ఎన్నో ఏళ్లుగా విగ్గు వాడుతూ వస్తోన్న నందమూరి బాలకృష్ణ రూపం జనరల్‌గా ఏ సినిమాలో చూసినా ఒకే విధంగా కనిపిస్తూ ఉంటుంది. డ్యూయల్ రోల్ చేసినప్పుడు మాత్రమే రెండింటికీ డిఫరెంట్ లుక్స్ ఉండేలా ఆయన చూసుకుంటారు. ఇటీవలి కాలంలో ఆయన 'సింహా', 'లెజెండ్' వంటి సినిమాల్లో పొడవాటి మెలితిప్పిన మీసంతో ఆకట్టుకున్నారు. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన 'పైసా వసూల్' మూవీలో 'లాంగ్ స్టబుల్' స్టైల్ మీసం, గడ్డంతో కనిపించి ఆశ్చర్యపరిచారు. అయితే ఇప్పుడు బాలకృష్ణ తన లుక్‌లో మరింత కొత్తదనం తీసుకువచ్చారు. వాన్ డైక్ అనే 17వ శతాబ్దికి చెందిన పెయింటర్ సృష్టించిన బియర్డ్ లుక్‌తో ఆయన యంగ్‌స్టర్‌గా మారిపోయారు. ఆ స్టైల్‌లో ఆయనను చూస్తుంటే 59 ఏళ్ల మనిషని నమ్మడం ఎవరికైనా కష్టమే. ఆయన ఇంత స్టైల్‌గా ఎందుకు మారారంటే, కె.ఎస్. రవికుమార్ డైరెక్ట్ చేస్తోన్న లేటెస్ట్ మూవీ కోసం. ఇప్పటికే ఈ సినిమా సెట్స్‌పై ఉంది. డిసెంబర్‌లో వచ్చే ఈ మూవీతో బాలయ్య ఎలాంటి క్రేజ్ సృష్టిస్తారన్నది ఆసక్తికరం.


Cinema GalleriesLatest News


Video-Gossips