వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ ఆయనే: చిరంజీవి
on Aug 21, 2019
తెలుగు ఇండస్ట్రీలో వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి. ఒకప్పుడు ఇండియాలో అత్యధిక పారితోషకం అందుకున్న హీరో చిరంజీవి. పదేళ్ల విరామం తరవాత సాదాసీదా కమర్షియల్ కథ, సినిమాతో రికార్డు వసూళ్లు సాధించిన హీరో చిరంజీవి. తెలుగు ప్రేక్షకులు, ఇండస్ట్రీలో హీరోలు ఆయన్ను మెగాస్టార్ గా చూస్తున్నారు. మరి, చిరంజీవి దృష్టిలో మెగాస్టార్ ఎవరో తెలుసా? బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్. ముంబైలో 'సైరా నరసింహారెడ్డి' టీజర్ విడుదల కార్యక్రమంలో 'ఇద్దరు మెగాస్టార్లు తొలిసారి కలిసి నటించారు. సెట్ లో వాతావరణం ఎలా ఉండేది?' అని చిరంజీవికి ఓ ప్రశ్న ఎదురైంది. వెంటనే "నా రియల్ లైఫ్ మెంటర్ అమితాబ్. సినిమాలోనూ నా మెంటర్ గా నటించారు. నా దృష్టిలో వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ ఒక్కరే. దటీజ్ అమితాబ్ బచ్చన్. ఆయన దరిదాపుల్లోకి ఎవరూ రాలేరు" అని చిరంజీవి అన్నారు. 'ఆజ్ కా గూండారాజ్' తరవాత హిందీలో సినిమా చేయకపోవడానికి కారణం సరైన కంటెంట్ దొరకకపోవడమే అని ఆయన అన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను భారతీయ ప్రేక్షకులు అందరికీ చెప్పాలని పాన్ ఇండియన్ లెవెల్ లో 'సైరా నరసింహారెడ్డి' తీశామని చిరంజీవి చెప్పారు.