ఏంటి చిరూ మరీనూ!
on Jun 25, 2015
సినిమా గురించి క్లారిటీ వచ్చినంత వరకూ ఓ టెన్షన్. క్లారిటీ వచ్చాక డైరెక్టర్ టెన్షన్. ఆ తర్వాత హీరోయన్ టెన్షన్. ఇదంతా ఎవరిగురించి అంటారా ఇంకెవరండీ మెగాస్టార్ చిరంజీవి సినిమా గురించే. ఇన్ని టెన్షన్స్ తర్వాత ఎట్టకేలకు పూరీ జగన్నాధ్ డైరెక్టర్ అని క్లారిటీ వచ్చింది. అప్పుడే ఫస్ట్ ఆఫ్ చిరు విన్నారు...సూపర్ అన్నారని పూరీ సంబరపడుతూ ట్వీట్ చేశాడు. ఇక చిరు బర్త్ డే నాడు ఎనౌన్స్ మెంట్ తరువాయి అని అంతా ఎదురుచూస్తున్నారు.
ఇంతలో చిరు అభిమానులకు మరో టెన్షన్ పట్టుకుంది. పూరీ కథ సిద్ధం చేస్తున్నాడంటూనే...మరోవైపు చిరు,వినాయక్ కలసి మాట్లాడుకున్నారు. అంతేనా...చిన్నికృష్ణ కథ సిద్ధం చేశాడని... ఆ కథను వినాయక్ తెరకెక్కించనున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో చిరు 150 సినిమా నుంచి పూరీ అవుట్ అయి వినాయక్ వచ్చాడా? లేదా పూరీతో సినిమా తర్వాత వినాయక్ కు డేట్స్ ఇస్తాడా? ఇంతకీ చిరంజీవి 150 వసినిమా ఏ దర్శకుడితో? ఇప్పుడిదే హాట్ టాపిక్. దీనికి క్లారిటీ రావాలంటే ఆగస్ట్ 22 రావాలి మరి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
