చిరుకి 'మంత్ర'మేసింది!
on May 13, 2015
.jpg)
చిరు 150వ సినిమా ప్రకటన అధికారికంగా బయటకు వచ్చేయడంతో పండగ చేసుకొంటున్నారు మెగా ఫ్యాన్స్. అయితే ఈ చిత్రంలో కథానాయిక ఎవరన్నది ఉత్కంఠతను రేకెత్తిస్తోంది. కథానాయిక ఎవరైనా సరే... ఐటెమ్ గీతం ఛాన్స్ మాత్రం ఛార్మికి దక్కిందని టాక్. పూరి జగన్నాథ్ - ఛార్మికి మధ్య ఫ్రెండ్లీ రిలేషన్ ఈమధ్య మరీ బాగా పెరిగిపోయింది. ఇద్దరూ కలసి జ్యోతిలక్ష్మి చేస్తున్నారు. ఈ సినిమాలో ఛార్మి పార్టనర్ కూడా. ఆ అనుబంధంతోనే ఆటోజానీలో ఐటెమ్ గీతంలో నర్తించే ఛాన్స్ ఛార్మికి ఇచ్చేశాడు పూరి. ఛార్మి అనగానే చిరు కూడా ఓకే చెప్పేశాడట. నిజానికి టెంపర్‌లోనే ఛార్మి ఓ ప్రత్యేక గీతం చేయాల్సింది. కానీ కుదర్లేదు. ఈసారి మాత్రం మెగా ఆఫర్ అందుకొంది. దాదాపు అగ్ర హీరోలందరితోనూ జత కట్టిన ఛార్మి చిరుతోనే నటించలేదు. ఈసారి, అందులోనూ మెగా 150వ సినిమాలో బంపర్ ఆఫర్ కొట్టేసింది. అటు జ్యోతిలక్ష్మి, ఇటు ఆటోజానీ... ఛార్మికి మంచి రోజులు మొదలైనట్టే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



