రజనీ రెమ్యూనరేషన్ తగ్గించుకుంటారా?
on Jul 16, 2020
దేశం ఎలాగైతే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందో, ఫిల్మ్ ఇండస్ట్రీ అంతకంటే ఎక్కువ సంక్షోభాన్ని చవిచూస్తోంది. అనేక ఇతర రంగాలు తమ కార్యకలాపాల్ని పునరుద్ధరించగా, సినిమా ఇండస్ట్రీ మాత్రం స్తబ్దుగా ఉంది. నాలుగు నెలలుగా సినిమా హాళ్లు మూతపడిపోయాయి. షూటింగ్‌లు ఆగిపోయాయి. దాంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది కార్మికుల, ఉద్యోగుల ఉపాధి ప్రమాదంలో పడింది. సెట్స్ మీదున్న సినిమాల నిర్మాతలైతే తీవ్ర ఆర్థిక నష్టంలో కూరుకుపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సినీ నిర్మాణం ఆలస్యమయ్యే కొద్దీ వాళ్ల అప్పులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అనేకమంది తమిళ నటులు తమ పారితోషికాల్ని తగ్గించుకుంటామని ప్రకటించారు
మరి సూపర్‌స్టార్ రజనీకాంత్ పరిస్థితేమిటి? ప‌్రస్తుతం ఆయన హీరోగా 'అన్నాత్తే' సినిమా నిర్మాణంలో ఉంది. శివ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో మీనా, ఖుష్బూ, నయనతార, కీర్తి సురేశ్, ప్రకాశ్‌రాజ్ వంటి మహామహులు నటిస్తున్నారు. కరోనా మహమ్మారి దెబ్బకు ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. దాంతో ఆ చిత్ర నిర్మాతలు రజనీకాంత్‌తో కాస్ట్ కటింగ్ గురించి చర్చలు జరుపుతున్నారని కోలీవుడ్‌లో వినిపిస్తోంది. పెద్ద మనసు చేసుకొని రెమ్యూనరేషన్‌ను తగ్గించుకోవాల్సిందిగా ఇప్పటికే ఆయనను వారు అభ్యర్థించారని చెప్పుకుంటున్నారు. త్వరలోనే రజనీకాంత్ తన అభిప్రాయాన్ని చెబుతారని ఆశిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మస్తోన్న 'అన్నాత్తే' 2021 మొదట్లో ప్రేక్షకుల ముందుకు రానున్నది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
