ఓటీటీ: జూలై సెకండాఫ్‌లో ఆసక్తికర షోలు!
on Jul 16, 2020
జూలై నెలలో సగం రోజులు గడిచిపోయాయి. సినిమా ప్రియులకు ఇప్పుడు ఓటీటీ, యూట్యూబ్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లే ఎంటర్టైన్మెంట్ను బాగా అందిస్తున్నాయి. కొత్త సిరీస్‌లు, సినిమాలు కావాలంటే ఓటీటీయే ఇప్పుడు దిక్కు. రానున్న పదిహేను రోజుల్లో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ఏయే ఆసక్తికర సిరీస్, సినిమాలు వస్తున్నాయో తెలుసుకుందాం...
వర్జిన్ భానుప్రియ (జీ5)
జూలై 16 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ తన కన్యత్వాన్ని పోగొట్టుకోవాలని ప్రయత్నించే భానుప్రియ అనే యువతి కథ. అయితే ప్రతి ప్రయత్నంలోనూ ఆమె విఫలమవడం వినోదాన్ని పంచుతుందని చిత్ర బృందం చెబుతోంది. టైటిల్ రోల్‌ను ఊర్వశీ రౌతేలా చేసింది.
కర్స్డ్ (నెట్‌ఫ్లిక్స్)
జూలై 17 నుంచి స్ట్రీమింగ్ అయ్యే ఈ సిరీస్‌లో క్యాథరిన్ లాంగ్‌ఫోర్డ్ ప్రధాన పాత్రధారి. ఆమె 13 రీజన్స్ వై ద్వారా పాపులర్. మహిమాన్వితమైన ఖడ్గంతో ఆమె చేసే సాహస కృత్యాలు ప్రధానాకర్షణ. డేవాన్ టెరెల్, గుస్తాఫ్ స్కర్స్గార్డ్ కీలక పాత్రధారులు.
జస్ట్ మెర్సీ (నెట్‌ఫ్లిక్స్)
జూలై 21 నుంచి స్ట్రీమింగ్ అయ్యే ఈ సిరీస్‌లో బేస్‌బాల్ లెజెండ్ మైఖేల్ జోర్డాన్ లీడ్ క్యారెక్టర్ చేశాడు. వాల్టర్ మెక్‌మిలన్ (జేమీ ఫాక్స్)ను ఒక కేసు నుంచి బయటపడేసేందుకు వాదించే లాయర్‌గా అతను కనిపించనున్నాడు. కోర్ట్ డ్రామాగా రూపొందిన ఈ సిరీస్‌లో అమెరికాలోని జాత్యహంకార అంశాన్నీ స్పృశిస్తుంది.
దిల్ బేచారా (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్)
సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ నటించిన చివరి సినిమాగా ఇప్పటికే కావాల్సినంత పబ్లిసిటీ వచ్చిన ఈ సినిమాతో సంజనా సంఘీ నాయికగా పరిచయమవుతోంది. సైఫ్ అలీఖాన్ ఓ కీలక పాత్ర చేసిన ఈ మూవీకి ముఖేశ్ ఛబ్రా దర్శకుడు కాగా, ఎ.ఆర్. రెహమాన్ మ్యూజిక్ ఇచ్చాడు. జూలై 24 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నది.
ఫ్రెంచ్ బిరియానీ (అమెజాన్ ప్రైమ్)
జూలై 24 నుంచి స్ట్రీమింగ్ అయ్యే ఈ కన్నడ మూవీలో ఒక ఫ్రెంచ్ బహిష్క్రుతుడూ, ఒక ఆటో డ్రైవర్ కలిసి చేసే మూడో రోజుల ప్రయాణ గాథ. ఆటోడ్రైవర్‌గా డానిష్ సైత్, ఫ్రెంచ్ వ్యక్తిగా సల్ యూసుఫ్ నటించిన ఈ కామెడీ మూవీని పన్నగ భరణ డైరెక్ట్ చేశాడు.
శకుంతలా దేవి (అమెజాన్ ప్రైమ్)
జూలై 31 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ మూవీ హ్యూమన్ కంప్యూటర్‌గా పేరుపొందిన శకుంతలా దేవి బయోపిక్‌గా తయారైంది. టైటిల్ రోల్‌ను విద్యా బాలన్ అపూర్వంగా పోషించిందని చెప్పుకుంటున్న ఈ సినిమాలో జిషుసేన్ గుప్తా, సాన్యా మల్హోత్రా, అమిత్ సద్ కీలక పాత్రధారులు. ఈ మూవీని అను మీనన్ డైరెక్ట్ చేసింది.