Home

»

Latest News

సాహోని రూ.400 కోట్ల‌కు కొనేస్తున్నారా?

May 20, 2017 3:53PM

బాహుబ‌లి తో ప్ర‌భాస్ రేంజ్ ఏ స్థాయికి వెళ్లిపోయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లెద్దు. ఒక్క‌సారిగా ఇంటర్నేష‌న‌ల్ హీరో అయిపోయాడు. బాహుబ‌లి 2 రూ.1500 కోట్లు వ‌సూలు చేసి క‌నీవినీ ఎరుగ‌ని రికార్డులు సృష్టించ‌డంతో బాలీవుడ్‌లోని ఖాన్ త్ర‌యానికీ సాధ్యంకాని అద్భుతాలు సాధించ‌డంతో.. ప్ర‌భాస్ ఇండియ‌న్ హీరో అయిపోయాడు. అందుకే సాహో సినిమాపై అంద‌రి దృష్టీ ప‌డుతోంది. ఈసినిమాకి ముందే భారీ రేట్ల‌కు కొనేయ‌డానికి పంపిణీదారులు ఆస‌క్తి చూపిస్తున్నారు. బాలీవుడ్‌కి చెందిన ఈరోస్ పంపిణీ సంస్థ సాహో సినిమాని సింగిల్ పేమెంట్ తో కొనేయ‌డానికి ముందుకొచ్చిన‌ట్టు స‌మాచారం.

ఈరోస్ సంస్థ సాహో నిర్మాత‌ల‌కు రూ.400 కోట్ల‌ని ఆఫ‌ర్ చేసింద‌ట‌. బాహుబ‌లిని మిన‌హాయిస్తే ఓ తెలుగు సినిమాకి ఈ స్థాయిలో మార్కెట్ జ‌ర‌గ‌డం ఇదే తొలిసారి. రూ.400 కోట్ల‌న్న‌ది మామూలు విష‌యం కాదు. అందుకే యూవీ క్రియేష‌న్ కూడా ఈ డీల్ ఓకే చేయ‌డానికి ఉవ్వీళ్లూరుతోంద‌ట‌. సాహోకి ముందు అనుకొన్న బ‌డ్జెట్ రూ.150 కోట్లు.. ఆలెక్క‌న రూ.250 కోట్ల లాభం మూట‌గ‌ట్టుకోవొచ్చు. కానీ ఇక్క‌డ ఓ మెలిక ఉంది. రూ.400 కోట్ల డీల్‌కి ఓకే చప్పిన నేప‌థ్యంలో సాహో బ‌డ్జెట్ మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. పైగా.. ఒక‌వేళ ఊహించని విధంగా న‌ష్టాలొస్తే మాత్రం నిర్మాత‌లు ఈరోస్‌కి న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల్సివుంటుంది. ఈ ఒప్పందం మీద‌.. ఈరోస్ ఈ సినిమాని కొన‌బోతున్న‌ట్టు తెలుస్తోంది.  సో.. ప్ర‌భాస్ సినిమా క్రేజ్‌కి ఇంత కంటే గొప్ప ఉదాహ‌ర‌ణ ఏం కావాలి??

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com