టైమ్ వస్తుంది.. ప్రతిదీ వెల్లడవుతుంది.. రాహుల్‌తో ఎఫైర్‌పై అషురెడ్డి కామెంట్!
on Nov 21, 2020
బిగ్ బాస్ 3లో మెరిసిన రాహుల్ సిప్లిగంజ్, అషురెడ్డి మధ్య అనూహ్యంగా అనుబంధం పెనవేసుకుంటున్నట్లు కథనాలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఈ షో ముగిసి హౌస్ నుంచి బయటకు వచ్చినప్పట్నుంచీ ఆ ఇద్దరి మధ్యా ప్రేమానుబంధం క్రమేణా బలపడుతూ వస్తోందని వినిపిస్తోంది. అయితే అప్పుడప్పుడు ఒకటీ అరా ఫొటోలు షేర్ చేసుకోవడం మినహాయిస్తే, తమ మధ్య రిలేషన్‌షిప్ గురించి ఆ ఇద్దరిలో ఎవరూ ఇటీవలి దాకా మాట్లాడింది లేదు.
అయితే రెండు రోజుల క్రితం ఫ్రెండ్స్‌తో కలిసి డిన్నర్ చేసిన రాహుల్.. ఒక ఫొటోను షేర్ చేసి, "Back to our “real”tionship @ashu_uuu (sic)" అని క్యాప్షన్ పెట్టి, హార్ట్ ఎమోజీ జోడించడం అందరి కళ్లనూ పెద్దవి చేసింది. ఆ ఫొటోలో డిన్నర్ టేబుల్ ముందు రాహుల్ కూర్చొని ఉంటే, అతని భుజంపై చేయిపెట్టి, వెనుక నిల్చుంది అషు. ఆ క్యాప్షన్‌తో ఆ ఇద్దరి మధ్య రియల్ రిలేషన్‌షిప్ ఉన్నట్లు జనం అర్థం చేసుకుంటున్నారు.
తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా రాహుల్‌తో క్లోజ్‌గా ఉన్న పిక్చర్స్‌ను షేర్ చేసిన అషు "Time comes, everything reveals..!! @sipligunjrahul" (టైమ్ వస్తుంది, ప్రతిదీ వెల్లడవుతుంది) అనే క్యాప్షన్ పెట్టి రాహుల్‌ను ట్యాగ్ చేయడం వారి మధ్య లవ్ ఎఫైర్ నడుస్తోందనే విషయాన్ని స్పష్టం చేసినట్లుగానే వారు ఫీల్ అవుతున్నారు. అషు పోస్ట్‌కు కామెంట్ సెక్షన్‌లో రాహుల్ స్పందించడం గమనార్హం. "When will the time come, baby!" అని అతను కామెంట్ పెట్టాడు.
ఒక్కసారి గతంలోకి వెళ్తే, ఈ ఏడాది జూన్‌లో అషు, రాహుల్ షేర్ చేసిన కొన్ని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లు వారి మధ్య రిలేషన్‌షిప్ గురించి హింట్ ఇచ్చాయి. అవి నెటిజన్లను సర్‌ప్రైజ్‌కు గురిచేశాయి. ఎందుకంటే అంతదాకా బిగ్ బాస్ 3లో మరో కంటెస్టెంట్, నటి పునర్ణవి భూపాలంతో రాహుల్ లవ్‌లో పడినట్లుగా ప్రచారం జరుగుతూ వచ్చిన విషయం తెలిసిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
