అర్జున్‌రెడ్డి ప్లేలిస్ట్‌లో తొలిప్రేమ సాంగ్
on Feb 8, 2018
లాస్ట్ ఇయర్ వచ్చిన అర్జున్‌రెడ్డి తెలుగునాట ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డైలాగ్ డెలీవరి, బాడీ లాంగ్వేజ్, స్క్రీన్‌ప్లేలో కొత్తదనం చూపించిన అర్జున్‌రెడ్డికి యువత ఫిదా అయ్యింది. ఈ మూవీలోని ప్రతీ ఫ్రేమ్‌ను.. ముఖ్యంగా పాటలకు యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. ఇప్పటికీ అర్జున్‌రెడ్డి సాంగ్స్ ఆల్‌టైమ్ ఫేవరేట్.. అయితే ఇందులోని బ్రేకప్ సాంగ్ చూసిన చాలామందికి.. కొత్తగా ఓ డౌట్ వచ్చింది. ఆ సాంగ్‌లోని విజువల్స్‌కి ప్రస్తుతం మరొక సాంగ్ ప్లే అవుతోంది. అది వరుణ్‌తేజ్ తొలిప్రేమలోని నిజమేనా.. నిజమేనా లిరిక్స్. ఆ లిరిక్స్ అండ్ ట్యూన్ కరెక్ట్‌గా అర్జున్‌రెడ్డి విజువల్స్‌కి సెట్ అవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రజంట్ ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సాంగ్ చాలా బావుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక వరుణ్ తేజ్ తొలిప్రేమ ఫిబ్రవరి 10న గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది.