"ఆ" అతి జాగ్రత్త తేజూ కొంపముంచుతుందా..?
on Feb 8, 2018

హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఏడా పెడా సినిమాలు చేస్తూ వచ్చిన మెగా మేనల్లుడు సాయిథరమ్ తేజ్‌కు ఇప్పుడు అర్జంట్‌గా ఒక హిట్ పడాలి. పక్క హీరోల సంగతి పక్కనబెడితే.. మెగా హీరోల నుంచే విపరీతమైన పోటీ వస్తున్న నేపథ్యంలో.. తనను తాను నిరూపించుకోవాలని సాయి భావిస్తున్నాడు. సీనియర్ డైరెక్టర్ వివి. వినాయక్‌తో జత కలిసి ఇంటిలిజెంట్ అనే సినిమా చేశాడు. ఫిబ్రవరి 9న రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు కూడా.. కానీ ఫస్ట్‌లుక్ నుంచే సినిమాపై సోషల్ మీడియాలో పెదవి విరుపులు మొదలవ్వగా.. ట్రైలర్ నాటికి అది తారాస్థాయికి చేరింది.
వినాయక్ మార్క్ ట్రేడ్ షాట్లు తప్ప అందులో కొత్తగా ఏం లేదు.. పోనీ పాటలైనా బాగున్నాయా అంటే..? ఒక్క పాట కూడా జనాల్లోకి వెళ్లలేదు. ఎంతో ఇష్టపడి రీమేక్ చేసిన కొండవీటి దొంగలోని "చమకు చమకు" సాంగ్ సోదీలో లేకుండా పోయింది. ఇంటిలిజెంట్ గురించి ఫిలింనగర్‌లో ఆరా తీసిన నిర్మాతలకు ఏమాత్రం పాజిటివ్ బజ్ కనిపించలేదట. సరిగ్గా ఇలాంటి సమయంలోనే అమెరికాలో ముందు రోజు ప్రదర్శించబడే ప్రీమియర్ షోలను రద్దు చేసినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. సినిమాకు హిట్ టాక్ వస్తే ఓకే.. ఒకవేళ బొమ్మ తిరగబడితే మాత్రం తలబొప్పికట్టడం ఖాయం. అందుకే ఎందుకొచ్చిన తంటా అని నిర్మాతలు ప్రీమియర్ షోలు రద్దు చేశారా అని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



