నయనతార పొగిడిన అనుష్క.. నయన బాగా సూటవుతుంది
on Oct 5, 2015

పాత హీరోయిన్ల సంగతేమో తెలియదు కాని.. ఇప్పుడున్న హీరోయిన్ల్లు మాత్రం ఒకరి గురించి ఒకరు మాట్లాడటానికి అస్సలు ఇష్టపడరు. కొంచెం టాప్ పొజిషన్లో ఉంటే చాలు అటోమెటిక్ గా ఈగో పెరిగిపోతుందనడంలో సందేహం లేదు. కాని వీటన్నింటికి భిన్నంగా అనుష్క వేరే హీరోయిన్ కు కాంప్లిమెంట్ ఇచ్చి తను ఢిపెరెంట్ అని అనిపించుకుంది. సాధారణంగా ఒక హీరోయిన్ ను మీ పాత్రలో ఏ హీరోయిన్ అయితే సూటవుతారు అని అడిగితే కొంతమంది నేనైతేనే సూటవుతాను.. ఇంకొంతమంది ఏమో చెప్పలేం అని సమాధానమిస్తారు. కాని రుద్రమదేవి సినిమాలో మీపాత్ర దేవసేనకు మీరు కాకుండా ఇప్పుడున్న హీరోయిన్లలో ఎవరైతే సూటవుతారు అని అడిగితే దానికి అనుష్క దేవసేన లాంటి రాజసం ఉట్టిపడే పాత్రకు ఇప్పుడున్న హీరోయిన్లలో నయనతార అయితే బాగా సూటవుతుందని చెప్పిందట.
ఇంకా రుద్రమదేవి.. సైజ్ జీరో మీద వస్తున్న రూమర్స్ పై ఆమె మాట్లాడుతూ.. గుణశేఖర్ తో తనకు ఎలాంటి అభిప్రాయబేధాలు లేవని.. సైజ్ జీరో సినిమాకి.. రుద్రమదేవి సినిమాకి మధ్య ఎలాంటి పోటీ లేదని.. రుద్రమదేవి సినిమా రిలీజ్ కాకపోతే ఆ టైమ్ కి సైజ్ జీరో సినిమా రిలీజ్ చేద్దామనుకున్నామని అన్నారు. కానీ అనుకున్న ప్రకారమే అక్టోబర్ 9 న రుద్రమదేవి సినిమా విడుదలవుతుందని చెప్పింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



